Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP MLA Rajasingh: గోవధను అడ్డుకుంటా దమ్ముంటే నన్ను అడ్డుకోండి

జూన్ 17న బక్రీద్ సందర్భంగా ఇక గోవు కూడా చ‌నిపోకుండా తాను అడ్డంప‌డ‌తాన‌ని, ద‌మ్ముంటే త‌న‌ను అడ్డుకోవాల‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పోలీసుల‌కు స‌వాల్ విసిరారు.

గోవుల తరలింపును అడ్డుకోవ ద్దని పోలీసులు బెదిరిస్తున్నారు
ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంధో చూసుకుందాం రండి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అల్టిమేటo

ప్రజా దీవెన, హైదరాబాద్: జూన్ 17న బక్రీద్ సందర్భంగా ఇక గోవు కూడా చ‌నిపోకుండా తాను అడ్డంప‌డ‌తాన‌ని, ద‌మ్ముంటే త‌న‌ను అడ్డుకోవాల‌ని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్(BJP MLA Raja Singh)పోలీసుల‌కు స‌వాల్ విసిరారు. గోవుల తరలింపు అడ్డు కోవద్దని హిందువులను పోలీసులు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. నాంప‌ల్లి(Nampally)లోని ఆయ‌న కార్యాల‌ యంలో మీడియాతో(Media)మాట్లాడు తూ గోవధను అడ్డుకుంటే బుల్లెట్(Bullet)దించుతా అని మ‌రో వ‌ర్గం బెదిరిస్తు న్నారన్నారు. ఎవరి బుల్లెట్ ఎవరికి దిగుతుంతో చూసుకుందాం రండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందు కార్యకర్తలకు ఫోన్ చేసి బెదిరించడం ఆపాలని మండిప డ్డారు. గోరక్షణ చేస్తే షూట్ చేస్తా మని కొంతమంది చెప్తున్నారని తెలిపారు.

వాళ్లకు నా ఛాలెంజ్ ఎవరిలో దమ్ము ఉందో చూసుకుం దామన్నారు.ఇక గోవధ చేయవద్ద ని, సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నిం చారు. ఇత‌ర ప్రాంతాల నుంచి సైతం హైదరాబాద్ కు యధేచ్చగా గోవులను తరలిస్తున్నారని మండి పడ్డారు. శాంతి భద్రతలకు విఘా తం కలగకుండా గోవుల(Cows)తరలింపు, హత్యలను అడ్డుకునే హిందూ కార్యకర్తలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు పని ని హిందూ కార్యకర్తలు చేస్తుంటే వాళ్ళను సపోర్ట్ చేయకుండా బెది రింపులకు దిగడం ఏంటని, పోలీస్ ఉన్న‌తాధికారుల‌ను రాజాసింగ్ నిల‌దీశారు. హిందూ కార్యకర్తలపై రౌడీ షీట్ పెడతారా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Rajasingh fight for cow