Farmer loan waiver:పేద రైతులకే ఉపశమనమా.!?
రైతు రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తుంది.
ఆర్థిక ఇబ్బందులెదుర్కొంటున్న రైతులకు ఊరట కలిగించేలా నిర్ణయం
రుణమాఫీపై విధివిధానాలపై త్వ రలోనే మంత్రివర్గ సమావేశం
ప్రకటించిన విధంగా తేదీలు,అర్హు ల గుర్తింపుపై కూడా అందులోనే నిర్ణయం
పక్క రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల అధ్యయనంకు సిద్ధం
పీఎం కిసాన్ తరహాలో కేంద్ర,రాష్ట్ర ఉద్యోగులు,మరికొన్ని వర్గాలను మినహాయించాలా వద్దా అని సంశయం
నిర్ధిష్ట మార్గదర్శకాలపై తీవ్ర కసర త్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
ప్రజా దీవెన, హైదరాబాద్: రైతు రుణమాఫీ(Farmer loan waiver)పై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మేధోమధనం చేస్తుంది. రైతు రు ణమాఫీ అమలుకు అనుసరించా ల్సిన మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభు త్వం తీవ్ర కసరత్తు ఇప్పటికే ప్రారం భించిన ప్రభుత్వం మరింత వేగిర పరుస్తోంది. అందులో భాగంగా కేం ద్రం అమలుచేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి సహా ఇతర రై తు సంక్షేమ పథకాలకు అనుసరి స్తున్న విధివిధానాలను పరిశీలి స్తోంది. ఇతర రాష్ట్రాల్లో చేసిన అధి కారులు చేసిన అధ్యయనాలను కూడా పరిగణనలోకి తీసుకుని పేద, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ప్రధానంగా ఉపశమనం కలిగేలా ఆ పథకాన్ని అమలు చే యాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుందని వెల్లడవుతోంది.
ఆ క్రమంలో రుణమాఫీ విధివిధానా లను ఖరారు చేసేందుకు వచ్చే వారం రోజుల్లో మంత్రివర్గ సమా వేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) నిర్ణయించారు. రైతుల కు ఇచ్చిన హామీమేరకు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇటీవలే వ్యవసాయశాఖ, ఆర్థిక శాఖ అధికారులను సీఎం ఆదే శించారు. రుణమాఫీకి(Loan waiver)ఎన్ని నిధు లు అవసరం నిధుల సమీకరణకు ఉన్న మార్గాలు, అందు బాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు రుణమా ఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలనే అంశంపైనా ఇంకా స్పష్టత రాలేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన డిసెంబరు ఏడో తేదీని కటాఫ్‌గా తీసుకుంటా రా మహాలక్ష్మి పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన డిసెంబరు 9వ తేదీ ని తీసుకుంటారా, వచ్చే ఆగస్టు 15 తేదీ వరకున్న బకాయిలను కూడా తీసుకుంటారా అనే అంశంపై క్యాబి నెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీ సుకునే అవకాశంఉంది. పెద్ద రైతు లకు రుణమాఫీ వర్తింపజేయాలా, వద్దా అనే అంశంపైనా క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు(Farmers) కేంద్రం ఏ టా రూ.6 వేలు ఆర్థిక సాయం అం దిస్తున్న సంగతి తెలిసిందే.
మంత్రు లు, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ఉద్యోగులు, రూ.10 వేలకు మించి పెన్షన్ అందుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఐటీ పన్ను చెల్లిం చేవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, సీఏ, ఆర్కిటెక్ట్ లాంటి ప్రొపెషనల్స్‌ను పీఎం కిసాన్ పథకం(PM Kisan Scheme)నుంచి కేంద్రం మినహాయించింది. ఈ నేపద్యంలో ఆ పథకానికి కేంద్రం అనుసరించిన మార్గదర్శకాల వల్ల అసలైన రైతు లకు లబ్ధి చేకూర్చిందనే అభిప్రా యం కూడా లేకపోలేదు.
ఈ నేప థ్యంలోనే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకూ మేలు జరిగేలా రుణమాఫీ అమలుకు ఎలాంటి మార్గదర్శకాలు పాటించాలనే అం శంపై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత కస రత్తు చేస్తోంది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును పరి శీలించడంతోపాటు ఇతర రా ష్ట్రాల్లో రుణమాఫీ అమలుకు అనుసరించిన విధివిధానాలపై వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అధ్యయనం చేస్తు న్నారు. ఉదాహరణకు మహా రాష్ట్రలో సహకారశాఖను నోడల్ ఏజెన్సీగా పెట్టి రూ.2 లక్షల వరకూ ఉన్న అన్ని రుణాలూ కలిపి రూ.20 వేల కోట్ల మేర పంట రుణాలు మాఫీ చేశారు.
డబ్బును నేరుగా రైతుల రుణ ఖాతాల్లో జమచేసి రుణవిముక్తులను చేశారు. నిర్ణీత గడువు(కటాఫ్ తేదీ)లో అప్పు తీసుకున్న రైతులు పెద్ద రైతులా, చిన్నరైతులా అని చూడకుండా అసలు, వడ్డీ కలిపి రూ. 2 లక్షల వరకు మాఫీచేశారు. రాజస్థాన్‌లో(Rajasthan)రైతు రుణ ఉపశమన కమిషన్ ఏర్పాటుచేసి అక్కడే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రిజిస్టర్డ్ బ్యాంకు, ఏదైనా ప్రభుత్వ సంస్థ నుంచి రుణాలు తీసుకున్న చిన్న, సన్నకారు రైతులకు రుణ మాఫీ చేశారు. వీటిలో ఏ రాష్ట్ర మోడల్‌ను(State model) ఇక్కడ పరిగణనలోకి తీసుకుని అమలు చేయనున్నారు అన్నది వారం రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశం అనంతరం వెల్లడికానుంది.
Relief for poor farmers