Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: తెలంగాణకు హ్యుందాయ్

–హైదరాబాద్ లోని హ్యుందాయ్ ఇంజినీరింగ్ సెంటర్ విస్తరణ
–హెచ్ఎంఐఈ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ
–అన్నిరకాల సహకారాలందిస్తామ ని సీఎం హామీ
–ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపి న హెచ్ఎంఐఈ
–ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడు లకు భారీ రాయితీలు
–ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడి

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దక్షిణ కొరియాఆటో మోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ (Hyundai Motor Company)దాని భారతీయ విభాగమైన హ్యుండా య్ మోటార్ ఇండియా ఇంజినీరిం గ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలంగా ణలో కారు మెగా టెస్ట్ సెంటర్ ను స్థాపించేందుకు సూచనప్రాయ అంగీకారం తెలిపింది. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతంలో హ్యుండా య్ కార్ల మెగా టెస్ట్ సెంటర్ లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ (Automated test track)సదుపా యంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్లు, ఎలక్ట్రానిక్ కార్ల తయారీ సౌకర్యం అందుబాటులోకి రానుం ది. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఇంజినీరింగ్ కేందం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా భార తదేశం సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పిం చనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని దక్షిణ కొరియాలో (South Korea) పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు.

ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాష్ట్ర మంత్రి శ్రీధరబాబుతో చర్చల అనంతరం ఆ సంస ప్రతినిధులు మాట్లాడు తూ భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, భారతీ య వినియో గదారుల కోసం బెంచ్ మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకే తికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాల అభివృద్ధి చేసేం దుకు తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలి యజేస్తున్నట్లు హెచ్ఎంఐఈ (HMIE) ప్రతిని ధులు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పె ట్టుబడులను తెలంగాణలో పెట్టిం చేందకు తమ ప్రభుత్వం దృష్టి సా రించిందన్నారు. తమ రాష్ట్రంలో ఆటోముబైల్ రంగంలో పెట్టుబడుల కు భారీ ప్రోత్సా హకాలు, రాయి తీ లు ఇస్తామని ప్రకటించారు.

హ్యం డాయ్ మోటార్ కంపెనీ తన అను బంధ సంస్థ ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ (Car testing) సదుపాయం నెలకొ ల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందన్నా రు. రాష్ట్రం అను సరిస్తున్న పారిశ్రామికస్నేహ పూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవ స్థతో ప్రగతిశీల భవిష్యత్ ను దృష్టి లో ఉంచుకొని తెలంగాణలో వ్యా పారం చేసేందుకు హ్యుందాయ్ మోటార్ వంటి అత్యుత్తమ తరగతి కంపెనీలు ముందుకు వస్తున్నా య ని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్ సమీ పంలోని సౌక ర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫ రాదారులను ఆకర్షించే అవ కాశం ఉందన్నారు. ఇది ప్ర త్యక్షం గా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహ దపడుతుందన్నారు.

సియోల్ లో చుంగ్‌గేచంగ్ నదీ పరిసరాల పరిశీలన… దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరం నడిబొడ్డున ప్రవహించే చుంగ్‌ గేచంగ్ నదీ పరిసరాలను తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, (Revanth Reddy, ministers Duddilla Sridhar Babu)ఇతర ప్రతినిధి బృందం పరిశీలించారు. హైదరాబాద్‌ మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయా లన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి గారు సియోల్ లోని అక్కడి నదిని ప్రపంచస్థాయి వాటర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దిన తీరుతెన్నులను క్షు ణ్ణంగా తెలుసుకున్నారు.ఈ నది సుందరీకరణ జరిగిన తీరుతెన్నుల ను గమనించిన తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ పై అనే క ఆలోచనలకు అవకాశం ఇచ్చిం దని ముఖ్యమంత్రి వ్యాఖ్యానిం చారు.దాదాపు 11 కిలోమీటర్ల ఈ నది విపరీతమైన కలుషితాలతో ఉండేది. ఈ నదిని 2005 నాటి నుంచి పునరుద్ధరణ పనులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రివర్ ఫ్రంట్‌గా తీర్చిదిద్దన తర్వాత సియోల్ నగరవాసులే కాకుడా ప్రపంచం నలుమూలల నుంచి ఏటా దాదాపు 19 కోట్ల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు.