–గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫి కేషన్లకూ వర్తింపజేస్తాం
–సుప్రీం ధర్మాసనం గొప్ప తీర్పు
–తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
–పరస్పరం మిఠాయిలు పంచుకు న్న సీఎం, దళితమంత్రి,ఎమ్మెల్యేలు
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతిం చినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను (ABCD classification)అమ లు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. అవరమైతే ఇదివరకే జారీ చేసిన ఉ ద్యోగ నోటిఫికేషన్లకూ వర్గీకరణను వర్తింపజేయడానికి ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ, ఉప కులాల సోదరులకు న్యాయం చేసే బా ధ్య తన తీసుకుంటామని చెప్పారు. వర్గీకరణ అత్యంత ప్రధానమైన అం శం అని దీనికి సభ ఏకాభిప్రాయా నికి రావాలని, మాదిగ, మాదిగ ఉప కులాలకు సంపూర్ణంగా సహక రించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు విపక్షాల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం అని చెప్పారు.
షెడ్యూల్డు కులాల ను ఏబీసీడీ గ్రూపులుగా ((ABCD classification)) వర్గీకరించ డానికి గురువారం సుప్రీంకోర్టు ధర్మా సనం అనుమతించింది. ఆ మేరకు సుప్రీం ధర్మాసనానికి కృతజ్ఞతలు తెలుపుతూ గురువారం శాసనసభ లో సీఎం ఓ ప్రకటన చేశారు. ‘‘ఎస్సీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ కో సం మాదిగ, మాదిగ ఉప కులాలకు సంబంధించిన యువకులు కొన్ని దశాబ్దాల నుంచి పోరాటాలు చేస్తు న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నుంచి 27 ఏళ్లుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటానికి ఇప్పుడు అనుకూల తీర్పు వచ్చింది. అప్పట్లో ఇదే శాస నసభలో మాదిగ, ఉపకులాల వర్గీక రణ కోసం వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదిస్తే నాతో పాటు ఆనాటి శాసన సభ్యుడు సంపత్‌కుమార్‌ను సభ నుంచి బహిష్కరించారు. ఏబీ సీడీ వర్గీకరణపై ((ABCD classification))ప్రధానమంత్రిని కలవడానికి గత ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళతామని చెప్పి, తీసుకెళ్లకుండా మాదిగ సోదరులను మోసం చేసింది. 2023 డిసెంబరు 3న మా ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్నాక మా ఉప ముఖ్యమంత్రి సూచన మేరకు.. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రి దామోదర రాజ నర్సింహ నేతృత్వంలో మా శాసన సభ్యులు, అడ్వొకేట్ జనరల్ బృం దాన్ని ఢిల్లీకి పంపాం. సుప్రీం కోర్టు న్యాయ కోవిదులతో చర్చించాలని చెప్పాం. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించింది.
ఆ మేరకు సుప్రీంకోర్టు మాదిగ, మాదిగ ఉప కులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇచ్చింది’’ అని రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వివరిం చారు. సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మా సనానికి తాను మనస్ఫూర్తిగా కృత జ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొ న్నారు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చి న తీర్పు చాలా గొప్పదని, ఇంత ప్రధానమైన అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో ప్రతిపక్ష నేత కేసీఆర్ (kcr)సభలో లేరు అని పేర్కొ న్నారు. మంత్రి దామోదర్ రాజన ర్సింహ మాట్లాడుతూ ఈ రోజు న్యాయం, ధర్మం గెలిచిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం తరపున అఫిడవిట్ ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నా నని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మందుల సామేలు, వేముల వీరేశం, లక్ష్మీకాం తరావు తీర్పు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సభలో ఈ అంశంపై మాట్లాడడానికి విపక్ష సభ్యులకు స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుమతించారు. కాగా అంతకు ముందు సుప్రీం తీర్పు అనంతరం మంత్రి దామోదర, ఎమ్మెల్యే కడి యం, ఇతర ఎమ్మెల్యేలు సీఎం (cm) చాం బర్‌లో రేవంత్‌ను కలిసి డప్పు దరు వులతో కృతజ్ఞతలు తెలిపారు. ఆ యనకు మిఠాయిలు తినిపించా రు.