Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: సుప్రీం కోర్టుకు క్షమాపణ చెప్పిన సీఎం రేవంత్

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: భారత న్యాయవ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 29న కొన్ని మీడియా వేది కల్లో తాను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కోర్టులను ప్రశ్నిస్తు న్నాననే అర్థంలో ధ్వనించాయని చెప్పారు. మీడియాలో వచ్చిన వార్త ల పట్ల సీఎం విచారం వ్యక్తం చేశా రు.ఈ నేపథ్యoలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సుప్రీం కోర్టుకు క్షమా పణ చెప్పారు. తన వ్యాఖ్యలు న్యా యవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపా దించారని సీఎం రేవంత్ ట్వీట్‌ (tweet( చేశారు. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తు న్నట్లు సోషల్‌ మీడియా పోస్టు చేశారు.తెలంగాణ సీఎం క్షమాప ణలకు కారణం గురువారం సుప్రీం కోర్టు (Supreme Court)ఆగ్రహం వ్యక్తం చేయడమే. ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్‌ హైకో ర్టుకు బదిలీ చేయాలన్న బి ఆర్ ఎస్ నేత జగదీష్‌రెడ్డి (Jagdish Reddy)పిటిషన్‌ విచారణ సందర్భంగా కవిత్ బెయి ల్‌పై సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యల పై ధర్మాసనం స్పందించింది.

ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. వ్యక్తులు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు మేము బె యిల్ ఇస్తామా అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరపు లాయర్లను జస్టిస్ గవాయి తిసభ్య ధర్మాసనం సూటిగా ప్ర శ్నించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీం కోర్టు పట్ల గౌరవంగా మెలగాలని, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి కా మెంట్స్ చేయడం ఎంత మాత్రమూ సరికాదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.దీంతో సీఎం రేవంత్‌ ట్వీట్‌ చేశారు. భారత న్యాయవ్యవ స్థపై తనకు అత్యంత విశ్వాసం, అపారమైన గౌరవం ఉందన్నారు. తన వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను ప్రశ్నించినట్టు ఆపాదించారని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందన్నారు. న్యాయవ్యవస్థపైనా, ఆ వ్యవస్థ స్వతంత్రతపైనా తనకు అత్యంత నమ్మకం ఉందని సీఎం రేవంత్ ఈ ట్వీట్‌లో (tweet) తెలిపారు. రా జ్యాంగం, దాని విలువలను విశ్వ సించే తాను ఎన్నటికీ న్యాయవ్య వస్థను అత్యున్నత మైనదిగా భావిస్తూనే ఉంటానని పేర్కొన్నారు.