Revanth Reddy: ప్రజా దీవెన, నల్లగొండ:ఖైరతాబాద్ మహా గణపతికి (Khairatabad Maha Ganapati) తొలి పూజ పూర్తైం ది. ఖైరతాబాద్ గణ నాధుడి వద్ద కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)దంప తులు చేరుకుని తొలి పూజలో పా ల్గొన్నారు. రేవంత్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభా కర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. శనివారం ఉదయమే ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మ శాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూ లు కండువా, గాయత్రి సమ ర్పించారు. గత ఏడాది 63 అడు గుల ఎత్తున్న వినాయకుడిని ప్రతి ష్టించగా ఈ ఏడాది 70 వసం తాల సందర్భంగా ఈ ఏడాది 70 అడు గుల ఎత్తులో బడా గణేష్ కొలువు దీరాడు.పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందు కున్న మీదట ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరు గనుంది. మధ్యాహ్నం మూడు గం టలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) పూజలో పాల్గొననున్నారు.
ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనా థుడు (Khairatabad Maha Ganapati) భక్తులను అనుగ్రహి స్తున్నాడు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్ (Bada Ganesh). గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమయినా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ త యారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగ ణపతికి ఇరువైపులా శ్రీనివాస క ళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి.బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి (As Ayodhya Balaramudi) విగ్రహం రూపొందింది. ఇక మహా గణపతిని చూసేందుకు పెద్ద సం ఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తు లు ఖైరతాబాద్ గణపతిని దర్శిం చుకునేందుకు రానున్నారు. వారి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్‌ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుం టారని ఉత్సవ్ కమిటీ భావిస్తోంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
