ప్రజా దీవెన, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ టెక్ దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ చైర్మన్ & సీఈవో సత్య నాదెళ్ల తో కీలకం గా భేటీ అయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి సీఎం హైదరాబా ద్‌లోని సత్య నాదెళ్ల నివాసంలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమా ల్లో భాగస్వామిగా ఉండాలనే తమ నిబద్ధతను కొనసాగిస్తామని సత్య నాదెళ్ల గారు తెలిపారు. ఈ సంద ర్భంగా నైపుణ్యాభివృద్ధి, భవిష్యత్ అవసరాలకు తగినట్లు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే విషయంలో ముఖ్యమంత్రి దార్శని కతను సత్య నాదెళ్ల ప్రశంసించా రు. ప్రజా ప్రభుత్వం తలపెట్టిన నైపుణాభివృద్ది, మెరుగైన మౌలిక వసతల కల్పన వంటి అంశాలు ఆర్థికాభివృద్ధికి దోహదపడటంతో పాటు హైదరాబాద్‌ను ప్రపంచం లోని టాప్ నగరాల్లో ఉంచగలవని సత్య నాదెళ్ల అభిప్రాయపడ్డారు.
టెక్నాలజీ రంగంలో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం ఏఐ, Gen AI, క్లౌడ్ ఆధారిత వ్యవస్థల అభివృద్ధిపై దృష్టి సారించిందని, ఈ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సత్య నాదెళ్ల కి విజ్ఞప్తి చేశారు. హైదరా బాద్‌లోని తొలి సాంకేతిక సంస్థల్లో మైక్రోసాఫ్ట్ ఒకటని, ప్రస్తుతం 10,0 00 మందికి ఉపాధి కల్పిస్తోన్న విషయాన్ని గుర్తుచేసిన ముఖ్య మంత్రి రాష్ట్రంలోని 600 మెగా వాట్ల (MW) సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ లోనూ మైక్రోసాఫ్ట్ పెట్టుబడి పెట్టిన అంశాన్ని ప్రస్తా విస్తూ హైదరాబాద్‌తో పాటు తెలం గాణవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ పెట్టుబ డులను విస్తరిస్తున్నందుకు సత్య నాదెళ్ల కృతజ్ఞతలు తెలిపారు.
రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీ, కొత్త మ్యా నుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పనకు అమలు చేస్తున్న ప్రణా ళికలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వంటి సంస్థల ద్వా రా పరిశ్రమలకు అవసరమైన ప్రతిభావంతులను అందుబాటు లో ఉంచేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సత్య నాదెళ్ల వివ రించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
