–10 లక్షల చ.అ.ల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
–అందుబాటులోకి కొత్తగా 15 వేల ఉద్యోగాలకు అవకాశం
–నేడు ఉన్నఫలoగా ప్రారంభించ నున్న సీఎం రేవంత్ రెడ్డి
–డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొ ల్యూషన్ లలో నూతన ఆవిష్క రణలు
–నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రాక వచ్చీరాగానే వరుస కార్యక్ర మాలు
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రముఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Information technology giant Cognizant) రాష్ట్రంలో విస్తరణకు కార్యాచరణ ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పర్యటనలో ఇప్పటికే ప్రకటించిన మేరకు హైదరాబాద్ లో నెలకొల్పనున్న తమ కొత్త క్యాంపస్ ను ఆ సంస్ధ ప్రారంభించేందుకు స న్నాహాలు చేస్తుండగా బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉన్నపళంగా వచ్చి రాగానే శంకుస్థాపన చేయను న్నా రు. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈవో రవికు మార్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. న్యూజెర్సీలో ఈనెల 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చు కున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ పది రోజుల్లోనే కాగ్నిజెంట్ సంస్థ కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో (With Artificial Intelligence, Mission Learning, Digital Engineering, Cloud Solutions)తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ దృష్టి సారించింది.
అమె రికా, దక్షిణ కొరియా పర్యటన ము గించుకొని ఈ నెల 14వ తేదీ ఉద యం హైదరాబాద్ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి (revanth reddy) కాగ్నిజెంట్ కంపె నీ శంకుస్థాపనలో పాల్గొన నున్నా రు. ఈ కార్యక్రమానికి కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ కూడా హాజ రవుతారని అధికార వర్గాలు వెల్ల డించాయి. 1994లో చెన్నై కేంద్రం గా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపం చవ్యాప్తంగా విస్తరించింది. హైదరా బాద్ లో 2002 నుంచి కార్యకలా పాలు ప్రారంభించింది. ఐటీ కారి డా ర్ లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్లు ఇప్పటికే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 57 వేల మంది ఉద్యోగు లున్నారు. రాష్ట్రం లో ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థ గా కాగ్ని జెంట్ కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది.
10లక్షల చదనపు అడుగుల్లో విస్తీర్ణణ హైదరాబాద్ (hyderabad)లో 10 లక్షల చదనపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అద నంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషి యల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నిం గ్, డిజిటల్ ఇంజ నీరింగ్, క్లౌడ్ సొ ల్యూషన్స్ తో సహా వివిధ అధు నాతన సాంకేతికతలపై కొత్త క్యాం పస్ ఫోకస్ చేస్తుంది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్ల డించింది. హైదరాబాద్ లో (hyderabad) 10ల క్షల చదనపు అడుగుల కొత్త క్యాం పస్ నెలకొల్పుతామని, అదనంగా 15 వేల మందికి ఉద్యోగాలు లభి స్తాయని ప్రకటించింది. ఆర్టిఫీషియ ల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూ షన్స్ (With Artificial Intelligence, Mission Learning, Digital Engineering, Cloud Solutions) సహావివిధ అధునాతన సాం కేతికతలపై కొత్తక్యాంపస్ ఫోకస్ చేస్తుంది. ఇదిలా ఉండగా 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కా గ్ని జెంట్ ప్రపంచ వ్యాప్తంగా విస్త రించింది. హైదరాబాద్ లో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభిం చింది. ఐటీ కారిడార్ లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్ లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో దాదాపు 57 వేల మంది ఉద్యో గులున్నారు. రాష్ట్రంలో ఐటీరం గం లో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తు న్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ కు పేరుంది. గడిచిన రెండేండ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యా సంస్థల నుంచి 7500 మంది ప్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపనీ తెలంగాణ నుంచి రూ.772 5 కోట్ల ఐటీ ఎగుమతులను నమో దు చేసింది. గడిచిన అయిదేండ్లలో కార్పొరేట్ సోషల్ రెస్సాన్సి బులిటీ కింద ఈ కంపెనీ రూ.22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది.
నేడే రాష్ట్రానికి సీఎం రేవంత్ రాక.. వచ్చి రాగానే వరుస కార్య క్రమాలు పది రోజులుగా అమెరికా లోని పలు రాష్ట్రాలతో పాటు దక్షి ణ కొరియాలో పర్యటింన సీఎం రేవంత్ (revanth reddy)నేటి ఉదయం తిరిగి హైద రాబాద్ కు చేరుకోనున్నారు. వచ్చి రాగానే ప్రఖ్యాత ఐటీ సంస్థ కాగ్ని జెంట్ క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సచి వాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులు, వివిధ శాఖల ఉన్నతా ధికారులతో సమీక్షా సమావేశం నిర్వ హించనున్నారు. తుది విడత రుణమాఫీ నిధులకు సంబంధించి ఆర్థిక శాఖతో ప్రత్యేకంగా సమావేశ మవుతారు. గురువారం పంద్రాగస్టు రోజున గోల్కొండ కోటలో జాతీయ జెండాను విష్కరించి తెలంగాణ అభివృద్ధి ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే రోజు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం మెట్పల్లి మండలం పెద్దాపూర్ లో నిర్మాణం పూర్తయిన ‘సీతారామ’ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తారు. తుది విడత రుణ మాఫీ నిధులు విధుల విడుదల కూడా అక్కడి నుంచే విడుదల చేస్తారు. 16 లేదా 17న రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన తో పాటు పలువురు మంత్రులు కూడా వెళ్లే అవకాశం ఉందని పార్టీవర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియా మకం తదితర అంశాలపై ఏ ఐసీసీ పెద్దలతో సమావేశమై తుదినిర్ణ యం తీసుకుంటారు.