–పరస్పర మిఠాయిలు పంచుకొని హర్షాతిరేకాలు
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై (Classification of SC) సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ దళిత ప్రజాప్రతి నిధులు కలిశారు. పరస్పరం మిఠాయిలు పంచుకొని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యం లో ఎమ్మెల్యేలు వేముల వీరేశం మందుల సామ్యేల్, కడియం శ్రీహరి (Vemula Veeresham Samyel and Kadiam Srihari)తదితరులు పాల్గొని డప్పు దరువు లతో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞ తలు తెలిపారు.