— మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారి శ్రామికవేత్తలకు లబ్ది
— 40 ప్రతిపాదనలతో సరికొత్తగా రూపకల్పన
–చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధే లక్ష్యం
–ఎంఎస్ఎంఈ పాలసీ 2024 విడు దల
— మాదాపూర్ లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎంఎ స్ఎం ఈ పరిశ్రమల స్థాపన, అభి వృద్ధి దిశగా చర్యలకు పూనుకున్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీని తీ సుకువచ్చింది. ఎంఎస్ఎంఈ చిన్న, మధ్యతరహా పరి శ్రమల పాలసీ 2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) బుధవారం మాదాపూర్ శిల్పకళా వేదికలో జరిగిన కార్య క్రమంలో ఆవిష్కరించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ అధి కారులు, పరిశ్రమల శాఖకు (IT, Industries Department Officials, Industries Department) సంబం ధించిన 22 అసోసియేషన్స్ ప్రతిని ధులు, పారిశ్రామిక వేత్తలు హాజర య్యారు.చిన్న, మధ్యతరహా పరిశ్ర మలు ఎదుర్కొం టున్న ఆరు అదం కులను ఈ కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వం గుర్తించింది. భూమి సౌలభ్యత మూలధన లభ్యత, ముడిపదార్థాల అందు బాటు శ్రామిక, శక్తి కొరత, సాంకే తిక సౌలభ్యత లేక పోవడం, మార్కె ట్లతో అనుసం ధానం లేకపోవడం వంటి అంశాలు తెలం గాణలోని ఎంఎస్ఎంఈలు ఎదు ర్కొంటున్న సవాళ్లుగా ప్రభు త్వం గుర్తించింది. ఈ అడ్డంకు లను తొలగించడానికి 40 ప్రతిపాద నలు చేసింది. సరస మైన ధరలకు భూ మిని అందించ డం, ఆర్థిక వనరుల (Financial resources)ను అందుబా టులో ఉంచడం, ముడి పదార్థాల లభ్యతను అందు బాటులో ఉంచ డం. నైపుణ్యం గల కార్మికుల లభ్య త మెరుగుప రచడం, నూతన సాంకేతికతను ప్రోత్స హించడం, మార్కెట్లతో అనుసంధానత మెరు గుపరచడం వంటి అంశాలతో ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవ బోతున్నట్లు పాలసీలో పేర్కొన్నది.
ఇదిలా వుండగా ప్రభుత్వం నిర్మిం చాలని భావిస్తున్న ప్రతి పారి శ్రామి క పార్కులో 20 శాతం ప్లాట్లు ఎంఎ స్ఎంఈల కోసం రిజర్వు చేయను న్నట్లు కొత్త పాలసీలో ప్రభుత్వం పే ర్కొన్నది. వచ్చే ఐదేళ్లలో ప్రతి జిల్లా లో ఒక పారిశ్రా మికి పార్కు ఏర్పా టు చేయబోతున్నామని, అలాగే ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ (ORR, RRR)మధ్య 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మిం చబోతున్నదని స్పష్టం చేసిం ది. ఈ 10 పారిశ్రామిక పార్కులలో 5 ఎంఎస్ఎంఈ పార్కులు ఉండ నున్నాయి. వీటిలోని ప్రతి ఎంఎస్ ఎంఈ పార్కులో 5 శాతం ప్లాట్లు మహిళా పారిశ్రామిక వేత్తలకు, 15 శాతం ప్లాట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రా మిక వేత్తలకు రిజర్వ్ చేయను న్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎంఎస్ఎంఈలను సమర్థవం తం గా అమలుపరిచి నిర్వహణ, పర్య వేక్షణ కోసం ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నది.
గతంలో ఉన్న టీఎస్ ఐపాస్ పాల సీ వల్ల పెద్ద కంపెనీలకే ప్రయోజనం ఉందని, అందువల్ల కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రత్యేకంగా ఎంఎస్ ఎంఈల కోసం పాలసీ ఉం డాలని సూచించారని ఐటీ, పరి శ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి జయేశ్ రంజన్ చెప్పారు. దేశంలో ఎంఏ స్ఎం ఈలకు సంబం ధించి రాష్ట్ర పరిస్థితి మెరుగు పడే లా ఈ పాలసీ రూపొందిం చామ న్నారు. కంపెనీ లు, సంస్థల తో పోలిస్తే ఎంఎ స్ఎం ఈలు అనేక సవాళ్లు, సమ స్యలు ఎదుర్కొంటు న్నాయని వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందిచాలనేది ఈ పాలసీలో పొందుపరి చామన్నా రు.