–తెలంగాణ ప్రజాపాలనా దినోత్స వంలో రేవంత్
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర తెలంగాణ ప్రజలదని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)పేర్కొన్నా రు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న తెలంగాణ పాలనా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించిన సంగతి తెలిసిందే. ఇం దులోభాగంగా నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. జాతీయ జెం డా ను ఆవిష్కరించి పోలీసు వందనం (Police Salute) స్వీకరించారు. ఈ సం ద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంటే త్యాగం, బలి దానం అని పేర్కొన్నారు. తెలం గాణ విమోచనం, విలీనం అంటూ కొందరు ప్రవర్తించడం సరికాద న్నారు. గత పదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని ఆయన విమర్శించారు. వాటిని తాము గాడిలో పెడుతున్నామని చెప్పారు. రాష్ట్రం ప్రయోజనాల కోసం తాను ఢిల్లీ వెడుతుంటే కొందరు లేనిపోని బురద చల్లుతు న్నారని సీఎం విమర్శించారు.
తాను ఫాం హౌస్ సీఎం(cm) ను కాదని, పని చేసే సీఎంని అని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 17 తెలం గాణ ప్రస్థానంలో అత్యంత కీల కమైన రోజుని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజా కోణాన్ని జోడిస్తూ ‘‘ప్రజా పాలన దినోత్సవం’’ గా జరపాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పా రు.ప్రజా పాలన దినోత్సవం ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన, నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఈ నిర్ణయాన్ని ఎవరైనా తప్పుపడితే వారిది స్వార్థ ప్రయో జనమే అవుతుంది తప్ప ప్రజా హితం కాబోదని అన్నారు. తెలం గాణ భౌగోళిక స్వరూపం (Geography)బిగించిన పిడికిలి మాదిరిగా ఉంటుంది, ఆ పిడికిలి పోరాటానికి సంకేతమని, తెలంగాణలో అన్ని జాతులు, కులాలు, మతాలు కలిసికట్టుగా ఉంటాయన్న సందేశం అందులో ఇమిడి ఉందన్నారు. ఈ ఐక్యతను, ఈ సమైక్యతను దెబ్బతీసే విధంగా సెప్టెంబర్ 17 ను కొందరు వివా దా స్పదం చేయడం మంచిది కాదని ముఖ్యమంత్రి హితవు పలికారు.
జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర అధికారిక (Telangana’s official national anthem) గీతంగా, సంక్షిప్త నామాన్ని టీజీగా మార్చడం, సచి వాలయంలో తెలంగాణ తల్లి విగ్ర హ ప్రతిష్టకు భూమి పూజ, గద్దర్ పేరిట అవార్డులు, మహిళా విశ్వ విద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరును ఖరారు చేయడం వంటి తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీ (Cultural revival of Telangana)వనానికి చేపట్టిన అనేక చర్యలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు.ఎందరో మహనీయుల త్యాగఫలం మన తెలంగాణ, పరిపాలనలో, ప్రతి నిర్ణయం సందర్భంలో వారి త్యాగాలు మాకు గుర్తుంటాయన్నారు. నాలుగు కోట్ల ప్రజల సంక్షేమమే గీటురాయిగా పాలన ఉంటుంది. తెలంగాణ ప్రజలే ఈ రాష్ట్ర ప్రస్థానానికి నావికులని, వారి ఆలోచనలే మా ఆచరణ, వారి ఆకాంక్షలే మా కార్యాచరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.