–సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటన
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ లో హైడ్రా (HYDRA) పేరు చెప్పి భయపెట్టి, బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యా దులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy)స్పందించారు. గతంలో ఇచ్చిన నోటీసులు, రెండు మూడేండ్ల కింద టి ఫిర్యాదులను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు (Revenue, Municipal and Irrigation Officers)డబ్బులు డి మాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వ చ్చిందని, అటువంటి వారిపై చర్య లు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇలాంటి వసూళ్లకు పాల్పడే వారిపై ఫోకస్ పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ముఖ్యమంత్రి అప్ర మత్తం చేశారు.