Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: మాపోటీ పక్కరాష్ట్రాలతో కాదు ప్ర‌పంచంతోనే

–ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల తెలంగాణే మా సంక‌ల్పం
–ప్ర‌పంచ అవ‌స‌రాలు తీర్చే ఫ్యూచ‌ ర్ సిటీగా ఫోర్త్ సిటీ
–భవిష్యత్ నగరం కాగ్నిజెంట్‌కు సాదర ఆహ్వానం
–కాగ్నిజెంట్ నూత‌న ప్రాంగ‌ణ ప్రా రంభోత్స‌వంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: త‌మ పోటీ పొరుగు రాష్ట్రాల‌తో కాద‌ని ప్ర‌పంచంతోనే త‌మ పోటీ అని ము ఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)స్ప‌ష్టం చేశా రు. ఒక ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌ వ‌స్థ‌గా తెలంగాణ‌ను నిల‌పాల‌నేది త‌మ సంక‌ల్ప‌మ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. కోకాపేట‌లో కాగ్నిజెంట్ నూత‌న ప్రాంగ‌ణాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం ప్రారం భిం చారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌ మం త్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 430 సంవ‌త్స‌రాల చ‌రిత్ర హైద‌రాబాద్ కు ఉంద‌ని, న‌గ‌ర స్థాప‌కుడు కులీ కుతుబ్ షా నుంచి త‌న వ‌ర‌కు ఎవ‌ రు పాలించినా, ఎన్ని వ్య‌వస్థ‌లు మారినా విధానాల‌తో సంబంధం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ హైద‌రాబాద్ అభి వృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నార‌ని తె లిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం (In Andhra Pradesh Govt) మార‌గానే ఇక్క‌డి నుంచి పెట్టుబ‌ డులు అక్క‌డి త‌ర‌లిపోతాయ‌నే చ‌ర్చ‌ను కొంద‌రు ప్రారంభించార‌ని, కానీ త‌న పోటీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, క‌ర్ణా ట‌క‌, త‌మిళ‌నాడుతో (Andhra Pradesh, Karna Taka, Tamil Nadu) కాద‌ని ప్ర‌ పంచంతోనేన‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ ష్టం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రం, దేశంలోనే అత్య‌ధికంగా ఉద్యోగా లు, ఉపాధి క‌ల్పించే కాగ్నిజెంట్ త‌మ ద‌గ్గ‌ర ఉంద‌న్నారు. కుతుబ్ షాహీలు, నిజాంలు హైద‌రాబాద్‌ను నిర్మిస్తే, బ్రిటిష‌ర్స్ సికింద్రాబాద్‌ను నిర్మించార‌ని, 1992లో ఐటీ ప‌రి శ్ర‌మ‌ల‌కు నాటి ముఖ్య‌మంత్రి నేదు రుమ‌ల్లి జ‌నార్ద‌న్‌రెడ్డి శంకుస్థాప‌న చేస్తే ఆ త‌ర్వాత వ‌చ్చిన ముఖ్య‌ మంత్రులు చంద్ర‌బాబు నాయుడు, రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఐటీ ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేసి సైబ‌రాబాద్‌ను నిర్మిం చార‌ని తెలిపారు.ప్ర‌స్తుత ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు తాము నా లుగో న‌గ‌రం ఫ్యూచ‌ర్ సిటీ నిర్మిం చాల‌నుకుంట‌న్న‌ట్లు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. చైనా ప్ల‌స్ 1 కంట్రీ కోసం అమెరికా, సౌత్ కొరియా ఇత‌ర దేశాలు ఏవైతే ఎదురు చూస్తున్నాయో వాట‌న్నింటి ప్ర‌శ్న‌ల‌కు ఆ ఫ్యూచ‌ర్ సిటీ స‌మా ధానం చెబుతుంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. తమ చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూ పిస్తుంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

త్వ‌ర‌లోనే మ‌రిన్ని ఒప్పందా లు అమెరికా, దక్షిణ కొరియాల్లో (America, South Korea)పది రోజుల పర్యటన తర్వాత తాను ఈ రోజే తిరిగి వ‌చ్చాన‌ని, అక్క‌డ తాము క‌లిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్ లో పెట్టు బడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. త‌మ ప‌ర్య‌ట‌న‌ల ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబ డులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయని ముఖ్య‌మంత్రి వెల్ల‌డించారు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనుట్లు ము ఖ్య‌మంత్రి చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహ ణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను (Investor Task Force)ఏర్పాటు చేస్తామ‌ని సీఎం తెలి పా రు. తెలంగాణ‌కు మూడు రింగ్స్ ఉన్నాయ‌ని, మొద‌టిది కోర్ అర్బ‌న్ ఏరియా హైద‌రాబాద్ అని, రెండోది అవుట‌ర్ రింగు రోడ్డు-రీజిన‌ల్ రింగు రోడ్డు మ‌ధ్య‌న గ‌ల సెమీ-అర్బన్ ఏరియా అని, అక్కడ తాము తయారీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయబోతున్నామ‌న్నారు. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణ‌, అక్క‌డ అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసి యాలోనే అత్యుత్తమ గ్రామాలను అభివృద్ధి చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప‌క్క రాష్ట్రాల‌తో పోటీ ప‌డ‌డం నుంచి ప్ర‌పంచంతో పోటీ ప‌డేందుకు త‌మ ఆలోచ‌న‌ను ఎప్పుడో విస్త‌రించుకున్నామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

కాగ్నిజెంట్ విస్త‌ర‌ణ‌కు పూర్తి మ‌ద్ద‌తు కాగ్నిజెంట్‌ (Cognizant)విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైద‌రాబా ద్ లాగే కాగ్నిజెంట్ కూడా అంచె లంచెలుగా అభివృద్ధి చెందింద‌ని, రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్ని జెంట్ గుర్తింపు పొందిందని ముఖ్య‌ మంత్రి అన్నారు. 2002లో హైదరా బాద్ లో ప్రారంభ‌మైన కాగ్నిజెంట్ ల‌క్ష మందికి ఉద్యోగాలు క‌ల్పించేలా ఎదిగింద‌న్నారు. ఫ్యూచ‌ర్ సిటీ లోనూ కాగ్నిజెంట్ ప్రాంగ‌ణం ఏర్పా టు చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఆ హ్వానించారు. తెలంగాణ యువ‌త‌ కు మ‌రిన్ని ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాల‌ని ఆకాంక్షించారు. హైద‌రాబాద్ లాంటి న‌గ‌రం ఎక్క‌డా లేదు హైద‌రాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల న‌గ‌రం మ‌రెక్క‌డా లేద‌నని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త‌మ‌కు ప్ర‌పంచంతోనే పోటీ అని, ప‌క్క రాష్ట్రాల‌కు హైద‌రాబాద్ వంటి న‌గ‌రం, అవుట‌ర్ రింగు రోడ్డు, అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం, మంచి వాతావ‌ర‌ణం లేవ‌న్నారు. ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌ల‌కు ఇక్క‌డ త‌గినంత భ‌ద్ర‌త‌, సంస్థ‌ల‌కు అవ‌స‌ర‌మైన యువ‌శ‌క్తి తెలంగాణ‌లో ఉంద‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

తెలంగాణ (Telangana)రాష్ట్రం, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగ స‌మ‌స్య ప‌రిష్క‌రించాలంటే పారిశ్రామిక విధానం పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌ని, పెట్టుబ‌డిదారుల‌ను ప్రోత్స‌హించే విధానం ఉండాల‌ని త‌మ ప్ర‌భుత్వం విశ్వ‌సిస్తోంద‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. అందుకే ప్ర‌భుత్వం మారినా విధానాల్లో మార్పు లేద‌ని, ఇంకా వేగంగా, పార‌ద‌ర్శ‌కంగా, ప‌ట్టుద‌ల‌తో త‌మ ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల‌నుకుంటోంద‌న్నారు. పారిశ్రామిక వేత్త‌లు హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పెట్టుబ‌డిదారుల‌కు కావ‌ల్సిన అన్ని సౌక‌ర్యాలు, అనుమ‌తులు తాము క‌ల్పిస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ హైద‌రాబాద్ గురించి మాట్లాడుతున్నారు…

ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రూ ఈ రోజు హైద‌రాబాద్ గురించే మాట్లా డుతు న్నార‌ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. ఒక్క రోజు లోనే ఇక్క‌డ ఐటీ రంగం అభివృద్ధి చెంద‌లేద‌ని, 1992లో నాటి కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి ఐటీ ప‌రిశ్ర‌మ‌ల‌కు శంక‌స్థాప‌న చేస్తే త‌ర్వాత ప‌దేళ్లు పాలించినా మ‌రో పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి, ఆ త‌ర్వాత ప‌దేళ్లు పాలించిన కాంగ్రెస్ ముఖ్య‌మం త్రు లు ఇక్క‌డ ఐటీ ప‌రిశ్ర‌మ‌ను అభివృ ద్ధి చేశార‌ని తెలిపారు. దావోస్ ప‌ర్య‌ట‌న‌లో తాము కాగ్నిజెంట్ సీఈవో ర‌వికుమార్‌, కాగ్నిజెంట్ అమెరిక‌స్ ప్రెసిడెంట్, ఈవీపీ సూర్య గుమ్మ‌డితో క్యాంప‌స్ విస్త‌ర‌ణ‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌ర్చించార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ముఖ్య‌మంత్రి పిలుపున‌కు స్పందించి ఆరు నెలల కాలంలోనే ఇక్క‌డ క్యాంప‌స్ విస్త‌ర‌ణ పూర్తి చేసి మ‌రిన్ని ఉద్యోగ అవ‌కాశాలు కల్పి స్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపా రు. ప్ర‌పంచం నేడు ఏఐ,సైబ‌ర్ సెక్యూరిటీ, క్వాంట‌మ్ వంటి విభి న్న ర‌కాల ప్ర‌తిభ‌ను అన్వేషిస్తోంద‌ న్నారు. అందుకు అవ‌స‌ర‌మైన నైపుణ్యాల అభివృద్ధికి అవ‌స‌ ర‌మైన అన్ని ర‌కాల వ‌స‌తుల‌ను క‌ల్పించేందుకు త‌మ ముఖ్య‌మంత్రి దృష్టిసారించార‌ని మంత్రి శ్రీ‌ధ‌ర్‌ బాబు తెలిపారు. ఈ క్ర‌మంలోనే తాము ఏఐ సిటీ నిర్మించా ల‌నుకుంటున్న‌ట్లు వివ‌రించారు.

హైద‌రాబాద్‌లో మా నెట్వ‌ర్క్‌ లో కీల‌క‌మైన హ‌బ్‌: త‌మ నెట్వ‌ ర్క్‌లో (network) హైద‌రాబాద్ కీల‌క‌మైన హ‌బ్ అని కాగ్నిజెంట్ ఈవీపీ, కాగ్నిజెంట్ అమెరిక‌స్ ప్రెసిడెంట్ సూర్య గుమ్మ‌ డి తెలిపారు. కాగ్నిజెంట్ నూత‌న ప్రాంగ‌ణం ప్రారంభం అనంత‌రం సూర్య గుమ్మ‌డి మాట్లాడుతూ 200 2 నుంచి కాగ్నిజెంట్ అభివృద్ధిలో కీల‌క‌మైన హైద‌రాబాద్‌లో నూత‌న స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేంద్రాన్ని ప్రారం భించినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.46 ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఉంటే అందులో భార‌ త‌దేశంలో 2.40 ల‌క్ష‌ల మంది, వారి లో 57 వేల మంది హైద‌రాబాద్‌ లోనే ఉన్నార‌ని వెల్ల‌డించారు. ఇందులో 39 శాతం మంది మ‌హి ళ‌లేన‌ని తెలిపారు.అభివృద్ధి చెందు తున్న హైద‌రాబాద్‌తో త‌మ‌ది వ్యూహాత్మ‌క‌మైన పెట్టుబ‌డి అని, స్థానికంగా ప్ర‌తిభావంతులైన యువ‌త‌కు ఉపాధి క‌ల్పిస్తూ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏఐ, ఎంఎల్‌, డేటా ఇంజినీరింగ్‌, ఐవోటీలో క‌ట్టింగ్ ఎడ్జ్ స‌మ‌స్య‌ల‌కు త‌మ హైద‌రాబాద్ కేంద్రం ప‌రిష్కారం చూపిస్తుంద‌ని సూర్య తెలిపారు. తెలంగాణ‌లో విద్యా, నైపుణ్య శిక్ష‌ణ‌, స‌మాజ సంక్షేమం, ప‌ర్యావ‌ర‌ణ సుస్థిరాభివృద్ధికి తాము కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని వివ‌రించారు. హైద‌రాబాద్‌తో త‌మ నూత‌న విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించినందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి సూర్య గుమ్మ‌డి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగ్నిజెంట్ అభివృద్ధికి హైద‌రాబాద్ కేంద్రంగా ఉంద‌ని, నైపుణ్యాభివృద్ధి, ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డం, సాంకే తిక‌త‌, ఆవిష్క‌ర‌ణ‌ల విష‌యంలో కాగ్నిజెంట్ తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తుంద‌ని ఆయ‌న స్ప‌ ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో రాజేంద్ర న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్, ప్ర‌భు త్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్, ముఖ్య‌మంత్రి కార్య‌ద‌ర్శి వేముల శ్రీ‌నివాసులు, కాగ్నిజెంట్ ప్ర‌తి నిధు లు క్యాథీ, జాన్‌కిమ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.