–సరఫరాలో అంతరాయాలు సరిదిద్దాలి
–భవిష్యత్ అవసరాలకనుగుణం గా అందుబాటులో విద్యుత్తు
–ఖాళీ భూముల్లో సోలార్ ప్లాంట్ల తో రైతులకు ఫ్రీగా సౌర పంపులి వ్వాలి
–విద్యుత్తుపై సమీక్షలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా చూడాలని సీఎం రేవం త్‌రెడ్డి (Revanth Reddy)ఆదేశించారు. విద్యుత్తు సర ఫరాలో అంతరాయాలు ఉండ కూ డదన్నారు. తెలంగాణ ఒక బిజినె స్ హబ్‌గా మారనుందని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యు త్తు అందుబాటులో ఉండేలా చూ డాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఐటీ, పరిశ్రమల శాఖలతో సమన్వ యం చేసుకొని, కార్యాచరణ ప్రణా ళికను (Action plan)సిద్ధం చేసుకోవాలని నిర్దేశిం చారు. బుధవారం ఆయన తన నివాసంలో విద్యుత్తు శాఖపై సమీక్ష నిర్వహించిన సమీక్షలో ఉప ము ఖ్యమంత్రి భట్టివిక్రమార్క(Bhattivikramarka), ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్‌రాస్, డిస్కం ల సీఎండీలు ముషారఫ్ అలీ ఫారూఖీ,కర్నాటి వరుణ్‌రెడ్డి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ (Revanth Reddy)మాట్లాడుతూ రాష్ట్రంలో సౌర విద్యుత్తు వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల పరిధిలో వినియోగంలో లేని భూముల్లో సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ భూముల్లో కూడా సోలార్ యూనిట్లు పెట్టాలని సూచించారు.
సౌర విద్యుత్తు వినియోగాన్ని గణ నీయంగా పెంచాలని సీఎం రేవంత్ (Revanth Reddy) చెప్పారు. అందుకోసం రైతులకు సోలార్ పంపు సెట్లను ఉచితంగా అందించాలన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారె డ్డిపల్లెను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ఈ పథకాన్ని అమలు చేయా లని తెలిపారు. ఉచిత పంపు సెట్ల కార్యక్రమం అమలు కోసం ‘పీఎం కుసుమ్’ పథకాన్ని వినియోగించు కోవాలన్నారు. రైతులు కూడా తమ భూముల్లో సోలార్ యూని ట్లు ఏర్పాటు చేసుకొనేలా ప్రోత్స హించాలని సూచించారు. అక్కడ ఉత్పత్తయిన విద్యుత్తును పంపు సెట్లకు వాడుకున్న తర్వాత మిగిలి న దాన్ని డిస్కమ్‌లు కొనుగోలు చేసి, రైతులకు అదనంగా ఆదా యం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వంటగ్యాస్ బదులుగా సౌర విద్యుత్తును (Solar power) వాడు కునేలా చర్యలు చేపట్టాలని తెలి పారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి, వారు సౌర విద్యు త్తు వ్యాపారంలోకి అడుగుపెట్టేలా చూడాలని సూచించారు.
40 వేల మెగావాట్ల సామర్థ్యం సాధించాలి : రాష్ట్రంలో విద్యు త్తు స్థాపిత సామర్థ్యం 40 వేల మెగావాట్లకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశిం చారు. సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై అధిక లోడ్‌ను తగ్గించుకోవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వినియోగదారులకు 24 గంటల పాటు నాణ్యమైన వి ద్యుత్తును సరఫరా చేయాలని స్పష్టం చేశారు.