–ముఖ్యమంత్రి అమెరికా టూర్ ఫిక్స్
–పెట్టుబడులే లక్ష్యంగా ఆగస్టు 3 నుంచి యూఎస్ రేవంత్ పర్యటన
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలోని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై (Employment opportunities)దృష్టి సారిం చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పెట్టుబడులే లక్ష్యంగా మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సీఎం యూఎస్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. వచ్చే నెలలో ఆయన అమెరికాలో పర్యటనలో భాగంగా ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ (revanth)బృందం బయలుదేరి వెళ్లనున్నది.
వారంరోజులపాటు డల్లాస్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఆగస్టు 11న తిరిగి హైదరాబాద్ కు పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలు, పారిశ్రామిక వేత్తలను (CEOs and industrialists) ముఖ్యమంత్రి కలవ నున్నారు. రాష్ట్రంలో ఉన్న సాను కూల అవకాశాలను వారికి వివ రించి పెట్టుబడులను సమీక రించ బోతున్నట్టు తెలిసింది. పర్యటనలో భాగంగా లైఫ్ సైన్సెస్. కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర సంస్థల అత్యున్నత స్థాయి ఎగ్జిక్యూ టీవ్లలను సీఎం టీమ్ కలవనుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగు తు న్నది. అలాగే తెలుగు ప్రవాసుల ను సైతం సీఎం కలిసే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గతేడాది డిసెంబర్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి కి ఇది మూడో విదేశీ పర్యటన. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాడు లోని దావో స్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సద స్సులో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అధికా రులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
సదస్సులో భాగంగా 200కి పైగా ప్రముఖ సంస్థల ముఖ్యులతో సీఎం (cm) సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో రూ. 40,232 కోట పెటుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదానీ గ్రూప్, జేఎస్ డబ్ల్యూ, టాటా టెక్నాలజీస్, వెబ్ వర్క్స్, సర్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్, గోడీ ఎనర్జీ, అరజేన్ లైఫ్ సైన్సెస్, ఇన్నోవెరా ఫార్మా న్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ9 సొల్యూషన్ తదితర కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖ త వ్యక్తం చేశాయి. ఈ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి లండన్ లో పర్యటించగా తాజాగా అమెరి కా (usa) టూరు సిద్ధమయ్యారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ (Integrated Residential School)లపై సమీక్ష… రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై (Integrated Residential School)ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు ఉన్నతాధి కారులు పాల్గొన్నారు. ఇందుకు సంబం ధించిన మాస్టర్ ప్లాన్, ఇతర అంశాలపై చర్చిం చారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ స్కూళ్ల ఏర్పా టుకు ప్రభుత్వం కసరత్తు చేస్తు న్నది. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ప్రారంభించి వాటి పనితీరు ఆధారంగా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నది.