–అన్ని జబ్బులకు అక్కడే వైద్యం అందించేందుకు కృషి
–వెయ్యి ఎకరాలలో హెల్త్ టూరిజం ఏర్పాటు చేయబోతున్నం
–ప్రపంచంలోని ఏ దేశం వారికైనా వైద్య సేవలు అందిస్తాం
–ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్ చానల్, బసవతారకం ఆసుపత్రికి అక్కడే స్థలం
— ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీ పడి పని చేసే అవకాశం దక్కింది
–బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి 24వ వార్షికోత్సవoలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి
Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ సమీపంలోని శం షాబాద్ లో వెయ్యెకరాల్లో ఆరోగ్య పర్యాటక కేంద్రాన్ని ఏర్పాటు చేయ బోతున్నామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని జబ్బలకూ వైద్యసేవలు (Medical services) అందిస్తామని తెలిపారు. ప్రపంచంలో ఎవ రికైనా వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేయబో తున్నామని చెప్పారు. శనివారం బంజారాహిల్స్ (Banjara Hills)లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి (Basavatharakam Cancer Hospital) 24వ వార్షికోత్సవా నికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచలోని అన్ని జబ్బులకు ఇక్కడనే వైద్యం అందాలనే ఆలోచనతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇందు కోసం ప్రపంచంలో పేరు గాంచిన సంస్థలను హైదరాబాద్ కు రప్పిస్తా మని, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వారు ఎక్కువగా జబ్బుల బారిన పడుతున్నారని, వారు ఇక్కడికి సులభంగా చేరుకునేలా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గ్రీన్ చానల్ ఏర్పాటు చేస్తామని చెప్పా రు.
బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి (Basavatharakam Cancer Hospital)అదనంగా స్థలం కావాలని ఆస్పత్రి డైరెక్టర్ నామా నాగేశ్వరరా వు అడిగారని, ఆ స్థలాన్ని హెల్త్ టూరిజయం హబ్ లోనే కేటా యిస్తామని చెప్పారు. అభివృద్ధిలో ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడ తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యా నించారు. చంద్రబాబు రోజుకు 18 గంటలు పనిచేస్తారని, తాను కూడా 18 గంటల పాటు పని చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించామని చెప్పారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తమకు రాజకీయ వకాశం కల్పించిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బసవతారకం ఆస్పత్రి లీజు పొడిగింపు, ఇతర అనుమతుల అంశం తన దృష్టికి రాగా వెంటనే క్యాబినెట్ లో పెట్టి తీర్మానించామని చెప్పారు.
తనకు ఈ హోదా, గౌర వం వచ్చాంటే ఏ స్వార్థం లేకుండా ఎన్టీఆర్ (NTR) స్థాపించిన రాజకీయ పార్టీ వల్లేనని అన్నారు. ప్రస్తుతం మూడో తరం నడుస్తోందని గుర్తు చేశారు. తొలి తరంలో ఎన్టీఆర్, రెండో తరంలో చంద్రబాబు, బాలకృష్ణ, ఇప్పుడు భరత్, లోకేశ్ రాజకీ యాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఖమ్మం మాజీ ఎంపీ, ఆస్పత్రి డైరెక్టర్ నామా నాగేశ్వర రావు (Hospital Director Nama Nageswara Rao) మాట్లాడుతూ బసవతారం ఆస్ప త్రికి సీఎం రేవంత్ రెడ్డి పదె కరాల స్థలం అదనంగా కేటాయిస్తే సేవలను మరింత విస్తరిస్తామని అప్పిల్ చేశారు. ఇక్కడ క్యాన్సర్ కు వరల్డ్ క్లాస్ సేవలు అందుతున్నా యని వివరించారు. ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బాలకృష్ణ మాట్లాడుతూ బసవతా రకం క్యాన్సర్ ఆస్పత్రి సేవలను ఏపీలోనూ విస్తరిస్తామని చెప్పారు. అక్కడి సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని అన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు చొరవ తోనే హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభమైందని చెప్పారు.