Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: దేశ క్రీడా రంగానికే తెలంగాణ కేంద్ర బిందువు

–శిక్షణా సంస్థలన్నింటినీ ఒకే గొడు కు కిందకు తీసుకురావాలి
–హైదరాబాద్ భవిష్య త్తులో ఒలిం పిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలి
–అంతర్జా తీయ ప్రమాణాలతో కూ డిన నిపుణులతో శిక్షణ ఇప్పించాలి
–స్పోర్ట్స్ యూనివర్సిటీపై సమీక్ష లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ క్రీడా రంగానికి తెలంగాణ కేంద్ర బిందువుగా ఉండాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చే శారు. ఫోర్త్ సిటిలో భాగంగా తల పెట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీపై ఉన్నతాధికారుల తో చర్చించారు. రకరకాల క్రీడలు, అకాడమీలు, పాఠశాలలు, క్రీడా శిక్షణా (Sports, academies, schools, sports training)సంస్థలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తేవడంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ రూ పుదిద్దుకోవాలని ఆదేశించారు.దశాబ్దాల కిందటే ఆఫ్రో-ఏసియన్ గేమ్స్, కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు ఆతి థ్యమిచ్చిన హైదరాబాద్ భవిష్య త్తులో ఒలింపిక్స్ క్రీడలకు వేదికగా నిలవాలని ముఖ్యమంత్రి అభిలషిం చారు. ఒలింపిక్స్ నిర్వహించడమే కాకుండా మన క్రీడాకారులు పతకా లను దక్కించుకునేలా వర్సిటీని తీర్చిదిద్దాలని చెప్పారు.

అంతర్జా తీయ ప్రమాణాలకు (international standards)అనుగుణంగా నిపుణులైన శిక్షకులతో శిక్షణ ఇప్పిం చాలని ఆదేశించారు.మన దేశం నుంచి ఒలింపిక్స్‌లో రాణించే షూ టింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, అర్చ‌రీ, జావెలిన్ త్రో, హాకీకి (For shoe tying, wrestling, boxing, archery, javelin throw, hockey) ప్ర‌థ‌మ ప్రాధా న్యం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత శిక్ష‌ణ ద్వారా ప‌త‌కాలు సాధించే అవ‌కాశా లు ఉన్న మిగతా క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇ ప్పించాల‌ని సూచించారు.చిన్న‌ త‌నంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను ఉపాధ్యాయ‌లు గుర్తించాల‌ని ముఖ్య‌మంత్రి సూ చించారు. అలాంటి విద్యార్థులంద‌ రికీ ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చేలా ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి లో ఒక స్పోర్ట్స్ స్కూల్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ పాఠ‌శాల‌ల్లో విద్యా బోధ‌న‌తో పాటు క్రీడ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండేలా శిక్ష‌ణ ఇప్పించాల‌న్నారు.ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన దేశాలు, క్రీడా కారుల వివ‌రాల‌ను సేక‌రించి, క్రీడా కారులు శ్ర‌మించిన తీరు, క్రీడల పట్ల ఆయా దేశాలు అనుసరిస్తున్న విధానాలను అధ్య‌య‌నం చేసి స‌ మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూ చించారు.యంగ్ ఇండియాకు తెలం గాణ ఒక బ్రాండ్ గా మారాలని చెప్పారు. స్కిల్ యూనివర్సిటీకి యంగ్ ఇండియా (Young India for Skill University) పేరు పెట్టిన తర హాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి కూడా యంగ్ ఇండియా పేరును ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.