Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: దేశంలోనే నవయువ రాష్ట్రంగా తెలంగాణ

–16వ ఆర్ధిక సంఘ సమావే శంలో సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్ : దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని త‌మ‌ రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రజాభవన్ లో 16వ ఆర్ధిక సంఘ సమావే శంలో ఆయ‌న మాట్లాడారు. దేశం లోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని చెప్పారు. దేశాభివృద్ధిలో తెలంగా ణ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థి క వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తె లంగాణ అనేక సవాళ్లను ఎదు ర్కొంటోందని చెప్పారు.భారీ రుణ‌ భారం తెలంగాణ‌కు స‌వాళ్లు భారీ రుణ భారం తెలంగాణకు సవాల్‌ గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్స రం (Financial year) చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుం దని చెప్పారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో మౌలిక ప్రాజెక్టులకు (projects)నిధుల సమీకరణకు ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వె చ్చించాల్సిన పరిస్థితి ఏర్ప‌డింద‌ని, రుణాలు, వడ్డీ చెల్లింపులు సక్రమం గా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగ తిపై ప్రభావం చూపే అవకాశం ఉం దని ఆయ‌న అన్నారు. ఈ నేప థ్యంలో రుణాల సమస్యను పరి ష్కరించేందుకు త‌మ‌కు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు.రుణాన్ని రీ స్ట్ర‌క్చ‌ర్ చేసే అవ‌కాశం ఇవ్వాలి.

రుణాన్ని రీ స్ట్రక్చర్ (Restructure the loan)చేసే అవకాశం ఇవ్వండి లేదా త‌మ‌కు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాల‌ని సీఎం కోరారు. కేంద్ర పన్నుల్లో రా ష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచాల‌న్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామని, ఈ డిమాండ్ ను నెరవేర్చితే దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకారిస్తామ‌ని అ న్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని తెలిపారు. దేశాన్ని ప్రపంచం లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ (Largest economy)గా మార్చడంలో త‌మ‌ వంతు బాధ్యతను నేరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో మీ మద్దతు కోరు తున్నామన్నారు. తెలంగాణ ఎదు ర్కొంటున్న సవాళ్లను అధిగమిం చేందుకు మీ సిఫారసులు ఉపయో గపడతాయని నమ్ముతున్నామ న్నారు.