Revanth Reddy: చంద్రబాబుకు రేవంత్ శుభాకాంక్షలు
తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయు డికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశా రు.
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయు డికి(Chandrababu Nayudu)తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఫోన్ చేశా రు. ఆంద్రప్రదేశ్ లో(Andhra Pradesh)అఖండ విజ యం సాధించిన చంద్రబాబుకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సం బంధాలు కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు. విభజన అంశాల పరిష్కారానికి సహక రించాలని చంద్రబాబును రేవంత్ రెడ్డి(Revanth Reddy) కోరారు.కాగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 135, జనసేన 21, వైఎ స్సార్‌సీపీ(YSRCP) 11, బీజేపీ 8 స్థానా ల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజార్టీ సాధించింది టీడీపీ. ఈ నేపథ్యంలో 12వ తేదీన చంద్రబా బు నాయుడు ఏపీ సీఎంగా ప్రమా ణస్వీకారం చేయనున్నారు.
Revanth Reddy wishes to chandrababu