Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: మహిళల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యత

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: మహిళల ఆరోగ్య సంరక్షణకు (women’s health care)ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యక రమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షే మం (Women’s Health Care, Sankshe Man)కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థ లను బలోపేతం చేస్తామని తెలిపారు.

బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ (Sudha Reddy Foundation)నేతృత్వంలో గచ్చి బౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ పవర్ రన్’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. విజే తలకు బహుమతులు ప్రదానం చేశారు. పక్షి అకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వలంటీ ర్లను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పలువురు వైద్యులు, సుధా రెడ్డి ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.