–ఫోర్త్ సిటీ పనుల ప్రారంభానికి సన్నాహాలు
–ప్రపంచంలోనే అతి పెద్ద రెండంత స్తుల ఫైఓవర్ మెట్రో
–దిగ్గజ సంస్థలతో అలరారుతూ భవిష్యత్ నగరంగా విరాజిల్లుతుం ది
–ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డి వెల్లడి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: లక్షలాదిమంది నివసించేలా కాలు ష్య రహితంగా అత్యాధునిక రీతి లో నిర్మించనున్న నాలుగో నగరి (ఫోర్త్ సిటీ)కి అంతే స్థాయిలో ప్రత్యేక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. ఔటర్ రింగు రోడ్డుకు అనుసంధానిస్తూ దీనిని నిర్మించేందుకు కసరత్తు సాగిస్తోంది. ముచ్చర్ల బేగరికంచెలో దాదాపు 14 వేల ఎకరాల్లో తలపెట్టిన నాలుగో నగరాన్ని.. న్యూయార్క్, దుబాయ్, సింగపూర్లను (New York, Dubai, Singapore) తలదన్నేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులోభాగంగా బహుళ విధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీకి సీఎం శంకుస్థాపన చేశారు. అతి పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించాలని బీసీసీఐని కోరతామని అసెంబ్లీలో ప్రకటించారు. మరోవైపు పలు పెద్ద పెద్ద సంస్థలు కార్యాలయాల స్థాప నకు ఆసక్తిగా ఉన్నాయి. దీంతో కొత్త నగరికి ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉoడాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. నాగపూర్ లో 18 కి.మీ మేర 200 అడుగుల ప్రత్యేక రహదారి నిర్మాణం కింద 10 వరుసల రోడ్డు, దానిపై 6 లేదా 8 వరుసలు వీటిపై న మెట్రో రైల్ పూలింగ్ విధానంలో భూ సేకరణ సిటీ వరకు మెట్రో రైలు మార్గం ఉంటుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వెల్లడించా రు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై శనివారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరె డ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితర, ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ఫోర్త్ సిటీకి సన్నాహాలు ప్రారంభించారు.
రైతులకు న్యాయం చేస్తూ..
రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డుకు (Rawiryala Outer Ring Road)అనుసంధానిస్తూ 200 అడుగల వెడ ల్పుతో 18 కి.మీ. పొడవున రహదారి కోసం ప్రభుత్వం భూ సేకరణ ప్రయత్నాలు ప్రారంభిం చింది. అయితే, భారీగా సేకరణ చేయాల్సి ఉండడంతో పూలింగ్ విధానాన్ని ఎంచుకున్నారు. ఈ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే కిచ్చె న్నగారి లక్ష్మారెడ్డికి (Kichche Nnagari Lakshmareddy)అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి బేగరికంచె సభ లో ప్రకటించారు. ఈ మేరకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా రైతుల నుం చి భూమిని తీసుకునే ప్రయ త్నాలు మొదలయ్యాయి. మొత్తం 300 ఎకరాలను సేకరించనున్నా రు. వాస్తవానికి రహదారి నిర్మా ణానికి సుమారు 200 ఎకరాలు అవసరం. ఇందులో 50 ఎకరాలు అటవీ భూమి. 150 ఎకరాలను ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించా ల్సి ఉంది. పూలింగ్ విధానం కాబ ట్టి భూములు కోల్పోయిన రైతు లకు రోడ్డుకు ఇరువైపులా అభివృ ద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని సర్కారు భావిస్తోంది. దీంతో రెట్టింపు భూమి అంటే 300 ఎకరాల వరకు సేకరిం చాల్సి ఉంటుదన్నారు.
భూములు కోల్పోతున్నవారికి పరిహారం కింద 40్న భూమిని కొత్తగా నిర్మించే రోడ్డు (Road to be built) కు ఇరువైపులా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నారు. దీనిని 50 శాతా నికి పెంచాలని కొందరు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఎక్కువ మంది రైతులు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.డబుల్ డెక్క ర్ వయాడక్ట్ మెట్రో పూర్తయితే ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తిం పు పొందుతుంది. నాగపూర్ వార్ధా రోడ్డుపై నిర్మించిన అత్యంత పొడ వైన రెండంతస్తుల ఫ్లైఓవర్ ఉన్న మెట్రో పొడవు 3.14 కిలోమీటర్లు. ఇది గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఇక హైదరాబాద్ శివార్లలో నిర్మించే దా ని పొడవు 18 కిలోమీటర్లు. త ద్వారా ప్రపంచంలోనే అతి పెద్దది అవుతుందని అధికారులు చెబు తున్నారు. రహదారికి ఇరువైపులా స్కైటవర్స్ నిర్మాణాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రీన్ జోన్ను మల్టీపర్ సగా మార్చా లని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.
శంషాబాద్ విమానాశ్ర యం నుంచి నిర్మిస్తున్న మెట్రో లైనను ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు(ORR Service Road) పక్కనుంచి తీసుకువచ్చి రావి ర్యాల వద్ద రెండంతస్తుల ఫ్లైఓవర్ మెట్రో లైన్కు (Flyover to Metro Line) కలుపుతారు. ఇందు కోసం రావిర్యాలలో ఓఆర్ఆర్పై భారీ ఫ్లైఓవర్ నిర్మించి రింగు రోడ్డు ఎగ్జిట్ రోడ్లకు కూడా అనుసంధానం చేస్తారు. ఈ ప్రత్యేక రవాణా వ్యవ స్థ ఏర్పాటైతే విమానాశ్రయం, ఔట ర్ రింగు రోడ్డు నుంచి అరగంటలోనే నాలుగో నగరికి చేరుకోవచ్చు. బెటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు దాకా కనెక్టివిటీ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి రహదారి అనుసంధానత రూట్ మ్యాప్ను అధికారులు వివరించగా సీఎం పలు సూచనలు చేశారు. కొత్త హైకోర్టు నుంచి శంషా బాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం నిర్మాణానికి ప్రణాళికలు రూపొం దించాలని సీఎం రేవంత్ అధికా రులను ఆదేశించారు.