Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: ప్రపంచ బ్యాంకు ప్రసన్నం…!

–వరల్డ్‌ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం రేవంత్ చర్చలు సఫలం
–నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీ కి ఉభయపక్షాల నిర్ణయం
–నాలుగు ప్రాజెక్టులకు సహకారాని కి తెలంగాణకు ప్రపంచ బ్యాంకు అంగీకారం
–మూసీ సుందరీకరణ, స్కిల్‌ యూ నివర్సిటీ, ప్రజారోగ్య రంగాల్లో సహ కారం
–ఆర్థిక సహకారానికి సంకేతాలతో ప్రపంచబ్యాంకు సంసిద్ధం
–ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజ య్‌ బంగాతో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్‌ శాంతి కుమారి

Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్‌: అమెరికాలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy)పర్యటన సత్ఫ లితాలిస్తోంది. సరికొత్త పారిశ్రామిక వేత్తలకు స్వాగతం పలుకుతున్న సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)తీవ్రస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరితో తెలంగాణ రాష్ట్రంలో అందుబాటు లో ఉన్న వనరులకు సంబందిoచి సవివరమైన నివేదిక అంతర్జాతీయ పరిశ్రమల ముందుంచి వారిని పెట్టు బడులకు ఆకర్షించే పనిలో సత్ఫ లితాలు సాధించేందుకు శతవిధాల సక్సెస్ సాధిస్తున్నారు. ఈ క్రమం లోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం (A key decision) అమెరి కా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘన విజయం సాధించి మరో మెట్టు ఎక్కారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు సహకారం లభిం చింది. తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల జీవన ప్రమా ణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్‌ బంగా హామీ ఇచ్చారు. బుధవారం అమెరికా రా జధాని వాషింగ్టన్‌లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్‌ బాంగాతో సీ ఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ఉ న్నతాధికారుల బృందం సమావేశ మైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల గురించి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడి కి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ఇందులో కాలుష్యరహిత విధానా లకు ఉద్దేశించిన నెట్‌ జీరో విధా నా లు, మూసీనది సుందరీకరణ, యం గ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ప్రజారోగ్యానికి సంబంధించి చేపట్ట బోయే కార్యక్రమాలు ఉండడం గమనార్హం. మూసీ పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టుతో జల కా లుష్యం తగ్గుతుందని, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం (cm) తెలిపారు. దేశం లోని ప్రధాన నగరాలు ఎదు ర్కొంటున్న కాలుష్య సమస్యలకు తమ ప్రభుత్వం కాలుష్యరహిత విధానాలు అమలు చేస్తోందన్నారు.

ఇందులో భాగంగా కాలుష్య కారక మవుతుందని భావించే హైదరాబా ద్‌ ఫార్మాసిటీని (HYDERABAD PHARMACY)రద్దుచేసి కాలుష్య రహిత ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తు న్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ 4.0లో భాగంగా కొత్త నగర నిర్మా ణం గురించి సీఎం ప్రస్తావించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా సాధిం చిన తెలంగాణలో నిరుద్యోగం పెరి గిందని, ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగా ల భర్తీతోపాటు ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు సాధించేందుకు యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీని ప్రారంభించామని తెలిపారు. పరిశ్ర మలకు కావాల్సిన నైపుణ్యాలు అం దించి ఉపాధి అవకాశాలు కల్పిం చడం ఈ వర్సిటీ లక్ష్యమన్నారు. ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న కార్యక్ర మాలనూ సీఎం వివరించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా విన్న ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు.. తెలంగాణ ప్రభుత్వానికి భాగ స్వామ్యం అందించేందుకు సంసి ద్ధత వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకూ సాను కూలంగా స్పందించారు. ప్రాజెక్టుల అమలుకు త్వరలో సంబంధిత వర్గాల నిపుణులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.

జీనోమ్‌ వ్యాలీలో (Genome Valley) రూ.400 కోట్లకు మొగ్గు… ప్రముఖ ఫార్మా కంపెనీ వివింట్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక ఇం జెక్టబుల్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పా టు చేయనున్నట్లు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఈ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగా లు లభిస్తాయని పేర్కొంది. అమెరి కా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం బుధవారం వివింట్‌ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరి పారు. అనంతరం పెట్టుబడులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కంపెనీ నిర్ణయంపై సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. లైఫ్‌ సైన్సె స్‌ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్ర భుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుం దని, అవసరమైన రాయితీలు, మౌ లిక సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. అంకాలజీ, క్రిటికల్‌ కేర్‌ విభాగాల్లో అత్యంత నాణ్యమైన ఇంజెక్టబుల్స్‌, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ప్రపంచంలో పేరొందిన కార్నింగ్‌ ఇన్‌ కార్పొరేటెడ్‌ కంపెనీ కూడా తెలంగా ణలో కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చింది.నైపుణ్యాలతోపాటు పరిశ్రమల్లో సాంకేతిక ఆవిష్కర ణలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం బుధవారం ఎమర్జింగ్‌ ఇన్నోవేషన్‌ గ్రూప్‌ సీని యర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోనాడ్‌ వెర్క్లీ రన్‌ ఆధ్వర్యంలోని కార్నింగ్‌ ప్రతి నిధుల బృందంతో చర్చలు జరి పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అవగాహన ఒప్పంద పత్రాలపై అధికారికంగా సంతకాలు చేశారు.