Road Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ (Masab Tank Flyover) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదా లు (Road Accident) జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ఎన్ని చర్యలకు తీసుకుంటున్న ప్రమాదాలకు అడ్డుకట్ట వేయలే కపోతున్నారు. సోమవారం నగరంలో రెండు చోట్ల రోడ్డు ప్రమాదం జరుగగా.. మరో ప్రమాదం మేడ్చల్ లో చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Fatal road accident)చోటుచేసుకుంది. ఫ్లై ఓవర్ వద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీకి చెందిన క్యాబ్.. డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో క్యాబ్ ముందు సీట్ లో కూర్చున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగి సాయి తేజ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్యాబ్ (cab) లో ఉద్యోగులను తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. సాయితేజ మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.