Road Accident: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ (Hyderabad) పెద్దఅంబర్ పేట్ లో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. ఘట్ కేసర్ నుండి పెద్దఅంబర్ పేట్ వైపు లారీ వస్తుండగా ఔటర్ రింగురోడ్డు పై నుండి సర్వీస్ రోడ్డు (Service Road)లో లారీ పడి పోయింది.
అదే సమయంలో సర్వీస్ రోడ్ లో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ కింద పడడాన్ని గమనించిన స్థానికులు 108 కు, పోలీసులకు సమాచారం అందజేశారు. డ్రైవర్ ను హాస్పటల్ కు తరలించే లోపు మార్గమధ్యంలో మృతి చెందాడు. లారీ డ్రైవర్ (Lorry Driver) వివరాలు తెలియాల్సి ఉంది.