— యువనేత తలసాని సాయి కిరణ్ యాదవ్
Sai Kiran Yadav: ప్రజా దీవెన, హైదరాబాద్: క్రీడాకారులకు చేయూత ను అం దించడం ద్వారా జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని యువనేత తల సాని సాయి కిరణ్ యాదవ్ (Sai Kiran Yadav) కోరా రు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తమ నివాసం వద్ద మహిళా పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ (Female Powerlifter Vaishnavi Mahesh) కు తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల ఆర్థిక సహా యాన్ని అందజేశారు.అక్టోబర్ 4 నుండి 13 వ తేదీ వరకు దక్షిణా ఫ్రికా లో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు వైష్ణవి మహేష్ ఎంపికైంది. ఈ పోటీలకు హాజర య్యేందుకు ఆర్ధికంగా కొంత ఇబ్బం దిపడుతున్న విషయాన్ని తెలుసు కున్న తలసాని సాయి కిరణ్ యా దవ్ ఈ మేరకు తలసాని ట్రస్ట్ ద్వా రా 2 లక్షల రూపాయల ఆర్ధిక సహా యం అందజేశారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తల సాని సాయి కిరణ్ యాదవ్ మాట్లా డుతూ అనేకమంది నైపుణ్యం కలిగిన క్రీడాకారులు (Sportsmen) ఉన్నప్పటికీ, వారికి సరైన ప్రోత్సాహం లభిం చకపోవడం వలన రాణించలేక పోతున్నారని విచారం వ్యక్తం చేశా రు. వైష్ణవి మహేష్ (Vaishnavi Mahesh))కు గత 4, 5 సంవత్సరాల నుండి పవర్ లిఫ్టర్ గా జాతీయ, అంతర్జాతీయ స్థాయి లలో ప్రతిభ చాటే విధంగా ప్రోత్స హిస్తూ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎప్పటికైనా అంతర్జాతీయ వేదికలపై (International platforms)వైష్ణవి మహేష్ కు తన సత్తా చాటే అవకాశం లభిస్తుందనే పూర్తి నమ్మకం తనకు ఉందని, అది నిజం కాబోతుందని స్పష్టం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్ర, జాతీయ స్థాయిలలో మెడల్స్ ను సాధించిం దని చెప్పారు. ఆమె కష్టానికి ఫలి తంగా అంతర్జాతీయ స్థాయి పోటీల కు ఎంపికైందని తెలిపారు. కామన్వె ల్త్ పోటీలలో కూడా తన ప్రతిభను చాటుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రక్షాబంధన్ ను పురస్క రించుకుని వైష్ణవి సాయి కిరణ్ యాదవ్ కు రాఖీ కట్టింది.
ప్రోత్సాహాన్ని మరువలేను… వైష్ణవి
పవర్ లిఫ్టింగ్ లో తాను అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా తలసాని ట్రస్ట్, తలసాని సాయి కిరణ్ యాదవ్ (Sai Kiran Yadav) అందించిన సాయం, ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మరువలేనని పవర్ లిఫ్టర్ వైష్ణవి మహేష్ అన్నారు. తాను పవర్ లిఫ్టర్ గా కెరియర్ ను ప్రారంభించిన నాటి నుండి అనేక సందర్భాలలో అన్ని విధాలుగా సహాయం అందిస్తూ వస్తున్నారని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలిపింది. కామన్వెల్త్ పోటీలలో మెడల్ ను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.