Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Milk Drugs: మత్తుముఠా కొత్త ఎత్తు

పోలీసులు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా, ఎంత పటిష్ట భద్రతలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. యథేశ్చగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా సాగుతోంది.

పాలల్లో కలుపుకుని తాగే డ్రగ్స్ విక్రయం
ఎన్ని భద్రతలు తీసుకున్న ఆగని వినియోగం
హైదరాబాద్ కు ఇతర రాష్ట్రాల నుంచి సప్లై

ప్రజాదీవెన, హైదరాబాద్: పోలీసులు ఎన్నిరకాల చర్యలు తీసుకున్నా, ఎంత పటిష్ట భద్రతలు తీసుకున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడంలేదు. యథేశ్చగా ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా సాగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరంలోకి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. పోలీసుల కళ్లు కప్పి నగరంలోకి గంజాయి(Cannabis) తీసుకొస్తున్నారు.

పోలీసులకు పట్టుబడకుండా ఉండేందుకు రకరకాల మార్గాల్లో గంజాయిను(Drugs) తరలిస్తున్నారు. మొన్నటి వరకు హ్యాష్‌ ఆయిల్‌, చాక్లెట్లుగా మార్చి గంజాయిని విక్రయిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కేటుగాళ్లు మరో కొత్త ఎత్తు వేశారు. ఈసారి గంజాయిని ఏకంగా పొడిగా చేసి విక్రయిస్తున్నారు. తాజాగా టీఎస్‌ న్యాబ్‌తో పాటు ఎస్‌వోటీ, టాస్క్‌ఫోర్స్‌ ప్రత్యేక విభాగాలు గంజాయి రవాణాను అడ్డుకునేందుకు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. నగరంలోకి వస్తున్న వాహనాలపై ప్రత్యేక నిఘాపెడుతున్నారు.

దీంతో వీరి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంజాయిని పొడిగా చేసి విక్రయిస్తున్నారు. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక కిరాణా దుకాణంలో సైబరాబాద్‌ ఎస్‌వోటీ(SOT Police) పోలీసులు గంజాయి పొడిని స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ గంజాయి పొడిని పాలలో కలుపుకొని తాగుతున్నారని షాప్‌ ఓనర్‌ చెప్పడం విస్మయం కలిగించింది. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఐస్‌క్రీమ్‌లపై(Ice cream) హ్యాష్‌ ఆయిల్‌ చల్లి విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిహార్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల నుంచి గంజాయి చాక్లెట్లు నగరంలోకి ఎక్కువగా వస్తున్నాయి. పోలీసులు అలెర్ట్‌ కావడంతో ఇలా వేర్వేరు పేర్లతో గంజాయిని విక్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

Sale of drugs mixed with milk