Sand smuggling: ప్రజా దీవెన, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణాను (Sand smuggling) అడ్డు కోవడంలో విఫలమైన సిబ్బంది విష యంలో పోలీస్ శాఖ (Police Department)తీవ్రంగా స్పందించింది. మల్టీజోన్-2 పరిధి లోని తొమ్మిది జిల్లాల్లో ఇందుకు బాధ్యులను గుర్తించి, చర్యలు తీసు కున్నారు. ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు పడింది. వీరిని వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో పెడుతూ జోన్ ఐజీపీ వి.సత్యనా రాయణ గురువారం ఉత్తర్వులు వెలువరించింది. వీర్‌కు పంపిన వారిలో సంగారెడ్డి రూరల్, తాం డూరు రూరల్, తాండూరు టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్లతోపాటు వీపన గండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వం గూరు, ఉప్పునూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్(ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా సబ్-ఇన్‌స్పె క్టర్లు ఉన్నారు.
సమగ్ర దర్యాప్తు (A thorough investigation) అనంతరం ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షం గా సహకరించిన వ్యక్తులను గుర్తిం చి శాఖాపరమైన చర్యలు తీసుకో నున్నారు. రాష్ట్ర నిఘా వర్గాల నివేదికలు, విచారణల ఆధారంగా సీఐ, ఎస్సైలపై చర్యలు తీసుకున్నట్టు ఐజీ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. వీరితో పాటుగా గతంలో కూడా ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన ఒక సీఐ, అడవిదేవిపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడు గులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, బాజి రెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరా స్‌పేట్, తాండూరు, చిన్నంబావి ఎస్సైలపై బదిలీ వేటు వేశారు. ఇసుక అక్రమ రవాణాలో వసూ ళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొండమల్లేపల్లి హోంగా ర్డు, జడ్చర్ల హెడ్- కానిస్టేబుల్‌ను కూడా ఇప్పటికే డిస్ట్రిక్ట్ ఆర్మ్‌డ్ రిజిర్వ్‌డ్ (డీఆర్జీ) కార్యాలయాలకు అటాచ్ చేశారు. కాగా, ఇసుక మాఫియాతో చేతులు కలిపి ప్రభుత్వ ఆదాయా నికి గండికొడుతున్నారుని, ఈ వ్యవహారాన్ని సహించేది లేదని డీజీపీ జితేందర్ రెడ్డి (DGP Jitender Reddy) తేల్చి చెప్పా రు. వాగులు, నిషేధిత ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలతో పర్యావరణా నికి తీవ్ర ముప్పు కలిగే అవకాశాలు ఉన్నాయని, ఈ దందాను అణిచివే యాలని ఆయన ఆదేశించారు.ఇకపై ఇసుక దందా జరిగితే సంబంధింత పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులను చేస్తామని డీజీపీ హెచ్చరించారు. దీంతో ఇసుక మాఫియాతో సంబంధాలు పెట్టుకున్న పోలీసు అధికారుల్లో కలవరం మొదలైంది. అంతేకాదు, ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడంతో ఎక్కడ తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందోనని ఆందోళనలో ఉన్నారు.