ప్రజా దీవెన, హైదరాబాద్:మూడు దశాబ్దాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యాదగిరిగుట్ట ఎస్.వీ.ఎన్ ను ప్రగతి పథంలో నడిపిస్తున్న ఎస్.వీ.ఎన్ డిజిటల్ హైస్కూల్ స్థాపకులు గొట్టిపర్తి భాస్కర్ కు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు వరించింది. హైటెక్స్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్రస్మా రాష్ట్ర శాఖ అధ్యక్షులు సాదుల మధుసూదన్ ల చేతుల మీదుగా ఆయన అవార్డును అందుకున్నా రు.
వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవి తాల్లో వెలుగులు నింపుతూ వారికి అండగా నిలుస్తున్న సందర్భంగా భాస్కర్ అవార్డుకి ఎంపికయ్యారు. శనివారం హైటెక్స్ లో జరిగిన ట్రస్మా-ఎడెక్స్ అవార్డుల కార్యక్ర మంలో స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు ను అందుకున్న ఎస్.వీ.ఎన్ ఫౌం డర్, గొట్టిపర్తి భాస్కర్ ను పలువు రు అభినందించారు. కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కూడా భాస్కర్ చేసి న సేవలను ప్రశంసించి అభినందిం చారు. యాదాద్రి జిల్లాలో ఎంతో మంచి విద్యానందిస్తున్న గొట్టిపర్తి భాస్కర్, మాధురి దంపతులను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా ప్రశం సించారు.