–సెప్టెంబర్ రెండవ వారంలోగా భూ సేకరణ పూర్తి చేయoడి
–ఉన్నత స్థాయి సమీక్ష సమావేశo లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
Shanti Kumari: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు (HRRR) ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ కార్యక్రమానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చి, సెప్టెంబర్ రెండవ వారం లోగా ఈ ప్రాజెక్టు కు సంబంధించిన భూ సేకరణ పూర్తి చేయాలని సంబందిత జిల్లా కలెక్టర్ లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Shanti Kumari) ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష (High level review)సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారులు శ్రీనివాస్ రాజు, రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవిన్ మిట్టల్, అటవీ శాఖ అడిషనల్ సెక్రటరీ ప్రశాంతి, R&B శాఖ ప్రత్యేక కార్యదర్శి హరిచందన, సంయుక్త కార్యదర్శి హరీష్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్ది, యాదాద్రి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్లొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్. శాంతి కుమారి మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక RRR ప్రాజెక్టు రాష్ట్రంలో అత్యధిక ప్రాముఖ్యత సంతరించుకున్నదని, ఈ ప్రాజెక్ట్ సంబంధించి వివిధ దశలలో పెండింగ్ లో ఉన్న భూసేకరణ (Land Acquisition)ప్రక్రియ ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. భూసేరణ నష్ట పరిహారనికి సంబంధించిన అంశంపై ప్రత్యేక దృష్టి సారించి భూములు కోల్పోతున్న రైతులకు న్యాయ పరమైన నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం అందేవిదంగా జిల్లా స్థాయి లో కలెక్టర్ల అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి భూముల మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు కేసుల (court cases)పై కూడా ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు.