Shirdi Saibaba: ప్రజా దీవెన, హైదరాబాద్: మచ్చా రామలింగారెడ్డి షిర్డీ సాయిబాబాగా (Shirdi Saibaba)నటించిన దత్త ఫిల్మ్స్ నిర్మాణంలో మచ్చా రామ లింగారెడ్డి షిర్డీ సాయి బాబాగా నటించిన ప్రత్యక్షదైవం షిర్డీసాయి చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని సర్టిఫికెట్ పొందింది. షిర్ధి సాయి బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో భానుచందర్, సీత, విజేత, సతీష్, నగర్కర్ మొదలైనవారు నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కిషన్ కవాడియా (Kishan Kavadia) స్వరాలందించిన ఈ చిత్రంలో ప్రముఖ సినీ గేయ రచయిత కళారత్న డా.బిక్కి కృష్ణ పాటలు రాశారు. మాటలు దాసం వెంకట్రావ్ రాయగా కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం కొండవీటి సత్యం వహించారు, నిర్మాతలుగా యం.ఆర్.రెడ్డి, కోసూరు సుబ్బారావు, వెంకట్ లు వ్యవహరించారు.
ఈ చిత్రంలో మచ్చా రామలింగారెడ్డి షిర్డీ సాయిబాబా (Shirdi Saibaba)పాత్రలో లీనమై నటించారని చిత్రంలోని భక్తిరస సన్నివేశాలు భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభినందించారు. ఆధ్యాత్మిక చిత్రాలు కరువైన సమయంలో ఇలాంటి ఒక మంచి భక్తిరస చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు సాయిబాబా పాత్రలో నటించిన మచ్చ రామలింగారెడ్డి (Maccha Ramalinga Reddy) లు ప్రశంసనీయులన్నారు. కొండవీటి సత్యం స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెన్సార్ పనులన్నీ పూర్తీ చేసుకుని విజయదశిమికి విడుదల చేస్తామని నిర్మాత లు యం.ఆర్.రెడ్డి. కోసూరు సుబ్బారావు, పి వెంకట్ తెలిపారు. ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి సినిమా తెలుగు, కన్నడ, తమిళ్ భాషలో నిర్మించడం జరిగింది తెలుగు సినిమా సెన్సార్ (Sensor) పనులు పూర్తి చేశారు కన్నడ, తమిళ్ సెన్సార్ పనులు జరుగుతున్నాయని తెలిపారు ప్రత్యక్ష దైవం షిర్డీ సాయి తెలుగు సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు సెక్రటరీ, సభ్యులు నిర్మాతలకు అందజేశారు.