— క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ సన్నాహక సమావేశo లో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి
Shiv Sena Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో త్వరలో నిర్వహించ బోయే సీఎం కప్ 20 24 విజయ వంతానికి క్రీడా సంఘాల సహ కారం ఇంత అవసరమని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి (Shiv Sena Reddy)అన్నారు.గురువారం ఎల్ బి స్టేడియంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో క్రీడా సంఘాల ప్రతినిధులతో సీఎం కప్ 20 24 సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కే శివసేనారెడ్డి (Shiv Sena Reddy) మాట్లా డుతూ గ్రామీణ యువ క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో,మట్టిలోమాణికాలను గుర్తించే ఉద్దేశంతో చీఫ్ మినిస్టర్ కప్ (Chief Minister Cup)-2024 నిర్వహించాలని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ భావిస్తుందని వివరించారు.
నాలు గు అంచెల్లో గ్రామీణ, మండల, జిల్లా మరియు రాష్ట్రస్థాయిలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇందుకోసం సాంకేతికంగా మరియు నిర్వహణపరంగా క్రీడా సంఘాల (sports associations)మద్దతు అవసరమని ఆయన అన్నారు. ఎన్నెన్నో టోర్న మెంట్లు నిర్వహించిన క్రీడా సం ఘాల ప్రతినిధుల, అనుభ వజ్ఞుల సలహాలు సూచనలతో ఈ సీఎం కప్ ను విజయవంతం చేద్దామని ఆయన కోరారు.గతంలో మాదిరి కాకుండా మరింత మెరుగ్గా గ్రామీణ యువ క్రీడా ప్రతిభను ప్రోత్సహించే విధంగా ఈ క్రీడోత్స వాలు జరగాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సీఎం కప్ నిర్వహణలో పారా క్రీడాంశాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం అసలైన ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు గత పది సంవత్సరాల నుండి క్రీడారంగాన్ని (Sports field)పూర్తిగా విస్మరించిన కెసిఆర్ ప్రభుత్వం.. క్రీడా సంఘాల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దశలవారీగా క్రీడారంగా అభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలని పట్టుదలతో ఉన్నారని ఆయన తెలిపారు.
సంఘాల అన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (Telangana Sports Authority)సిద్ధంగా ఉందని చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి బాలాదేవి మాట్లాడుతూ, సీఎం కప్ నిర్వహణ విజయవంతం కొరకు వివిధ సంఘాలు ఆయా జిల్లా సంఘాల ప్రతినిధుల ద్వారా కృషి చేయాలని, ఎటువంటి లోటుపాట్లు లేకుండా సక్రమంగా నిర్వహించేం దుకు అవసరమైన సూచనలను రాతపూర్వకంగా స్పోర్ట్స్ అథారిటీకి తెలియజే యాలని కోరారు. ఈ కార్యక్ర మంలో డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి, రవీందర్, తెలంగాణ ఒలంపిక్ అసోసియేషన్ ప్రతినిధులు జగదీశ్వర్ యాదవ్,ప్రేమ్ రాజ్ మహేశ్వర్ వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.