Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sonu Sood : మాదాపూర్ లో సునూ సూద్

–కుమారి ఆంటీ ని కలిసిన సినీ నటుడు
–కుమారి ఆంటీ ఫుట్ స్టాల్ వద్ద సడన్ సర్ప్రైజ్
Sonu Sood:ప్రజాదీవెన, మాదాపూర్: కుమారి ఆంటీ (Kumari aunty)తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమె సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా ‘మీది మొత్తం థౌజెండ్ అయ్యింది. రెండు లివర్స్ ఎక్స్ ట్రా’ అనే డైలాగ్‌తో ఆమె క్రేజ్ సంపాదించుకున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ ఇతర సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫుడ్ స్టాల్ ఒక్కసారిగా ఫేమస్ (famous) అయిపోయారు. ఈ క్రమంలో ఆమె హోటల్‌కు జనం పోటెత్తారు. ప్రముఖ నటులు, సెలబ్రిటీలు సైతం ఆమె హోటల్‌కు క్యూ కడుతున్నారు.

సడన్ సర్‌ప్రైజ్..
తాజాగా, రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood) సైతం కుమారి ఆంటీని కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం మాదాపూర్‌లోని ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న ఆమె ఫుడ్ స్టాల్‌ను అకస్మాత్తుగా సందర్శించి సర్‌ప్రైజ్ (surprise) ఇచ్చారు. రియల్ హీరోను చూసిన కుమారి ఆంటీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ (Sonu Sood)వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోనూసూద్ సైతం వారితో కలిసి సందడి చేశారు. కుమారి ఆంటీని శాలువాతో సత్కరించి బొకే ఇచ్చారు. ఆమెతో సరదాగా మాట్లాడుతూ.. పంచ్‌లు వేస్తూ అందరినీ నవ్వించారు. ఫుడ్ సైతం సర్వ్ (serve) చేశారు.

కుమారి ఆంటీపై ప్రశంసలు
ఈ సందర్భంగా కుమారి ఆంటీపై సోనూసూద్(Sonu Sood )ప్రశంసలు కురిపించారు. మహిళా సాధికారతకు ఆమె బెస్ట్ ఉదాహరణ అని కొనియాడారు. భవిష్యత్తులో ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని ఆమెకు భరోసా ఇచ్చారు. రియల్ హీరో కుమారి ఆంటీని కలిసిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.