–మహారాష్ట్ర ముఠాగా గుర్తింపు
–ఇద్దరు నిందితుల అరెస్టు మరో ముగ్గురు కోసం గాలింపు
–మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
SP Sharath Chandra parwar:ప్రజా దీవెన, నల్లగొండ: జాతీయ రహదారిలో దోపిడీలకు పాల్పడు తున్న పార్ధి గ్యాంగ్‌కు సంబంధించి ఇద్దరు సభ్యులను అరెస్టు చేయగా, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నా మని ఎస్పీ శరత్ చంద్ర పవార్ (SP Sharath Chandra parwar )తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు(police)గాలిలోకి కాల్పులు జరిపి పట్టుకున్న విషయం విది తమే. వారిని ఈరోజు అరెస్ట్ చేయ డంతో అలాగే నిందితుల నుంచి ఒక స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, రూ .17 వేల నగదు, ఒక జత వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా, హైదరాబాద్ నగర పరిధి సైబ రాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతు న్నారన్నారు. కట్టంగూర్ పీఎస్ పరి ధిలో డబ్బుల(Money)కోసం ఓ లారీ డ్రైవర్ ను హత్యచేశారని చెప్పారు. తెలం గాణ వ్యాప్తంగా వీరిపై 32 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ గ్యాంగ్ మహారాష్ట్రకు చెందిన ముఠా అని చెప్పారు. వీరు ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా 24/7 దోపిడీలపై ఫోకస్ పెడతారన్నారు. దొంగలించిన అభరణాలను మహారాష్ర్టలో విక్రయిస్తుంటారని చెప్పారు.