Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sucide: అరణ్యరోదనగా ఆమె ఆక్రందన, తండ్రి అప్పులకు తనను వేధిoపులoటూ ఆమె ఆత్మహత్య

ప్రజా దీవెన, హైదరాబాద్: ఏమి జరిగిందో ఏమో కానీ తన తండ్రి చేసిన అప్పులకు తనను పోలీసు లు వేయిస్తున్నారంటూ సదరు కూ తురు చేసిన వక్రందన అరణ్య రోద నగా మిగిలింది. తెలిసిన వివరాల మేరకు తండ్రి తీసుకున్న డబ్బు లకు పోలీసులు తనను వేధిస్తు న్నారని పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మ హత్య చేసుకుంది. తండ్రితో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండకపోయినా డబ్బుల కోసం తననే వేధిస్తున్నా రని సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మ హత్య చేసుకుoది దీప్తి అనే పీహెచ్డీ విద్యార్థిని. హైదరాబాద్లోని నాచా రం పోలీస్ స్టేషన్ పరిధిలో నాచా రం సరస్వతి నగర్ కాలనీకి చెందిన పులివర్తి సంగీత్ రావు కుమార్తె దీ ప్తి (29) ఐఐసీటీలో పీహెచ్‌డీ చే స్తోంది.

వీరి ఇంటి ఎదురుగా ఉండే కానిస్టేబుల్ అనిల్ తన భార్యకు ఐ ఐసీటీలో ఉద్యోగం ఇప్పిస్తానని సం గీత్ రావు 2022లో రూ.15 లక్షలు తీసుకొని మోసం చేశాడని నాచా రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీంతో అనిల్ కి రూ.8 లక్షలు తిరిగి ఇచ్చినట్లు దీప్తి కుటుంబ సభ్యులు తెలిపినప్పటికీ డబ్బుల కోసం తన కూతురు దీప్తిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి తప్పుడు కేసు లు పెట్టారని సంగీత్ రావు ఆరో పణ చేస్తున్నారు. కేసు విత్ డ్రా చేసుకోవాలంటే రూ.35 లక్షలి వ్వాలని అనిల్ మామ సోమయ్య, భార్య అనిత, అనిత సోదరుడు సైదులు దీప్తిని డిమాండ్ చేయ సాగారు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండడం లేదని సమాధానం చెప్పింది.

అయినా ఆమె ఎంత చెప్పినా విన కుండా కేసులు పెట్టి పలుమార్లు పో లీస్ స్టేషన్‌కు పిలిచి అనిల్ బెదిరిం చారని తెలుస్తోంది. తనపై జరుగుతున్న మానసిక ఒత్తిడి పోలీసుల వేధింపులు తోడు కావడంతో మనో వేదనకు గురై దీప్తి ఇంట్లో ఎవ్వరూ లేని సమ యంలో ఫ్యానుకు ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకుoది. తాను ఇంత కఠిన నిర్ణయం తీసుకోవటా నికి పోలీసులు వేధింపులే కారణ మని ఆరోపిస్తూ మొబైల్లో వీడియో రికార్డ్ చేసుకొని ఆత్మహత్య చేసు కోవడం సంచలనగా మారింది.