Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

cotton seeds: రైతాంగానికి సరిపడా పత్తి విత్తనాలు

రాబోయే  ఖరీఫ్ 2024 లో రాష్ట్రములో దాదా పు 60.53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్తి సాగు కాగలదని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

నెలాఖరుకు అందుబాటులో BGII ప్రత్తి విత్తనాలు
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ప్రజా దీవెన, హైదరాబాద్: రాబోయే  ఖరీఫ్ 2024 లో రాష్ట్రములో దాదా పు 60.53 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ప్రత్తి సాగు(cotton seeds) కాగలదని వ్యవసాయ శాఖ అంచనా వేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అందు కనుగుణంగా సరిపడా BGII ప్రత్తి విత్తనాలను మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేసుకోవల్సిందిగా అధికా రులను ఆదేశించారు. 2021 లో 60.53 లక్షలుగా ఉన్న ప్రత్తి విస్తీర్ణo క్రమముగా తగ్గుతూ 2023లో 45.17 లక్షలకు వచ్చిందనీ, ఐనప్ప టికీ ప్రపంచ మార్కెట్లో ప్రత్తికి పెరుగు తున్న డిమాండ్ దృష్ట్యా ఈసారి విస్తీర్ణము పెరిగే అవకాశ ముందనందున BGII విత్తనాలను అందుబాటులో ఉంచాల్సిందిగా ఆదేశించారు.

గతేడాది 90 లక్షల ప్యాకెట్లు అమ్ముడుపోగా, ఈసారి 120 లక్షల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచడం జరుగు తుందని చెప్పారు. ఇప్పటికే రెండు దఫాలు సంబంధిత అధికారులు, విత్తన కంపెనీలతో సమావేశం జరిపి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

కేంద్ర ప్రభు త్వం ఈసారి ప్రత్తి విత్తన(cotton seeds) ప్యాకెట్ గరిష్ట ధరను రూ. 864.00 గా నిర్ణయించిదని, ఏ ఒక్క డీలరైనా, అంతకంటే ఎక్కువధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా విత్తన సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే ఏ కంపెనీని ఉపేక్షించబోమని, రైతుల ప్రయోజ నాలకు భంగం కల్గించే ఏ చర్యను ఈ ప్రభుత్వం సహించబోదని, విధులపట్ల అలసత్వం వహించినా అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా తనిఖీ బృందాలు ఏర్పాటు చేసు కొని, ఎప్పటికప్పుడు అమ్మ కాలను పర్యవేక్షిస్తూ నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిందిగా అధికా రులను మంత్రిగారు ఆదేశించారు.

Sufficient cotton seeds for farmers