–సిఎం ను కలిసిన కాంగ్రెస్ మాదిగ ప్రజా ప్రతినిధులు
Supreme Court: ప్రజా దీవెన, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై (On classification of sc)భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ (State Medical, Health and Family Welfare) శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డా. కవ్వంపల్లి సత్యనారాయణ, వేము ల వీరేశం, కాలే యాదయ్య, మం దుల శామ్యూల్ లు సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ అమలుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రంలో త్వరిత గతిన అమలు అయ్యేలా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డితో చర్చించాలని శాసనసభ్యులు, దళిత మేధావులు, సామాజికవేత్తలు రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ కు విజ్ఞప్తి చేశారు.
శాసనసభ్యులు, మాదిగ సామాజిక (Legislators, Madiga Social) వర్గానికి చెందిన మేధా వులు, సామాజికవేత్తలు చేసిన విజ్ఞప్తిపై మంత్రి దామోదర్ రాజన ర్సింహ సానుకూలంగా స్పందిం చారు. ఎస్సీ వర్గీకరణ అమలు పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) చర్చి స్తామన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పు రాష్ట్రం లో అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేధా వులు ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ ఖాసీం, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య, విజయ్ కుమార్ ముంజగళ్ళ, బాపిరాజు, ఎమ్మార్పీఎస్ నాయ కులు మేడి పాపయ్య మాదిగ, గోవింద్ నరేష్ లు పాల్గొన్నారు.