Supreme Court: ప్రజా దీవెన, హైదరాబాద్:బడులకు వెళ్లే పసిబిడ్డలపై లైంగిక ఆకృత్యాలు (Sexual forms) అధిక మవుతున్న పరి స్థితుల్లో సర్వోన్నంత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. చిన్నారులతో చిత్రకరించిన అశ్లీల దృశ్యాలను చూడడం వాటిని డౌన్లోడ్ చేయడమే కాదు వాటిని కలిగి ఉన్న పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ చట్టం కింద నేరం అవుతుందని సుప్రీం కోర్టు (Supreme Court) స్పష్టం చేసింది.
అలాగే, చైల్డ్ పోర్నోగ్రఫీ Child pornography) అనే మాటలను కోర్టు (court) ఆదేశాల్లో కానీ, తీర్పు ప్రకటనల్లో కానీ ఉపయోగించకూడదని కూడా భారత అత్యున్నత న్యాయస్థానం దేశంలోని అన్ని కోర్టులకు సూచించింది. చిన్నపిల్లలున్న అడల్ట్ వీడియోలను చూడడం పోక్సో నేరం కిందకు రాదని మద్రాస్ హైకోర్టు (Madras High Court)ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సోమవారం నాడు తోసిపుచ్చింది. చైల్డ్ పోర్నోగ్రఫీని వ్యక్తిగత గా చూడడం నేరం కాదని ప్రకటించడం ద్వారా మద్రాసు హైకోర్టు దారుణమైన తప్పు చేసిందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది..