Teacher transfers: నేటి నుంచి ఉపాధ్యాయ బదిలీలు
తెలంగా ణలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు.
పదోన్నతుల ప్రక్రియ కూడా ప్రారంభం
గతంలో నిలిచిన ప్రక్రియ కొనసాగింపు
విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో నిలిచిపోయిన ఉపాధ్యాయ బదిలీలు,(Teacher transfers)పదోన్నతులను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం(Burra Venkatesham)తెలిపారు. ఈ నెల 7 నుంచి 20 వరకు నిరుడు అక్టోబర్లో నిలిచిపోయిన ప్రక్రియను చేప డతామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఒక ట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. బదిలీలు, పదోన్నతుల ను ఆన్లైన్లో చేపట్టాలని కొన్ని సంఘాలు, ఆఫ్లైన్లో అని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు(Teachers unions)కోరడంతో ఏకాభిప్రాయంతో రావాలని ఆయా సంఘాలకు సూచించినట్టు తెలిపారు. తాజాగా 5,563 మంది సెకం డరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా(School Assistants)పదోన్నతులు లభిస్తాయి.
Teacher transfers from today