Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana formation day celebrations: అంబరాన్నంటిన సంబరాలు పదేళ్ళ ఆనందోత్సాహాలు

లంగాణ రాష్ట్ర అవతరణ ఉత్స వాల సంబరాలు అంబరాన్నoటా యి. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పులకరించింది.

జయ జయహే తెలంగాణ గీతానికి పలకరించిన జనం
వేలాది మంది నృత్యకారులతో ఆకట్టుకున్న కళారూపాల ప్రదర్శన
ప్రత్యేక ఆకర్షణ క్రాకర్స్ షోలో మిరిమిట్లు గొలిపేలా లేజర్ షో
రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణికి రాష్ట్ర ప్రభుత్వం ఘనసన్మానం

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్స వాల సంబరాలు(Telangana State Incarnation Utsavala Celebrations) అంబరాన్నoటా యి. శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలతో పులకరించింది. రాష్ట్ర ప్రభు త్వం ట్యాంక్ బండ్ పై తెలంగాణ సం స్కృతి, సంప్రదాయాలకు ప్రతీ కగా నిర్వహించిన వేడుకలు దశాబ్ది ఉత్సవాలకు వన్నెతెచ్చాయి. పదేం డ్ల పండుగ వేడుకలకు గవర్నర్ రాధాకృష్ణన్ తో(Governor Radhakrishnan)కలిసి ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మలు నాగేశ్వర్ రావు, సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. గవర్నర్ రాధాకృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా పదేండ్ల పండుగను ప్రారంభించా రు.

కళారూపాలతో కలకలలాడిన ట్యాంక్ బండ్(Tank bund)… పదేండ్ల పండుగ సందర్భంగా ట్యాంక్ బండ్ పై తొలు త 5వేల మంది పోలీసులు ఫ్లాగ్ పరేడ్ నిర్వహించారు. పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న పోలీసులు నిర్వహించి ఈ పరేడ్ పలువురిని అమితంగా ఆకట్టు కుంది. అనంతరం తెలంగాణ కళారూపాల ప్రదర్శనలో వందలా ది మంది కొమ్ము నృత్య కళాకారు లు తమకళల ప్రదర్శనలతో ముం దుకు కదలగా ప్రేక్షకులు అమితా నందంతో కరతాళ ధ్వనులు చేశా రు. తెలంగాణలోని అత్యంత ప్రాచీ నమైన ఈ నృత్యాన్ని తెలంగాణ సాంస్కృతిక శాఖ(Telangana Department of Culture)వృద్ధి చేసి ప్రద ర్శించింది. అనంతరం బతుకమ్మల ప్రదర్శన, గుస్సాడీ నృత్యం. తో ట్యాంక్ బండ్ పులకరించి పోయిం ది. డప్పు వాద్యాలు, కోలాటాల ఆటలు, పోతురాజుల నృత్యాలు, లంబాడీల డ్యా న్సులు, కంజీర నాదాలతో నృత్యాలు, కాకతీయుల కాలం నాటి పేరిణి ప్రదర్శనతో దశాబ్ది ఉత్సవాలకు మరింత వన్నె వచ్చింది. ట్యాంక్బండ్ ఇరువైపుల బ్యారికేడ్లను మూడు రంగుల వేసి ముస్తాబు చేసి సందర్శకుల కోసం సిద్ధం చేశారు. అయితే ఊహించిన దానికంటే సందర్శకులు భారీగా కదలి వచ్చారు. ట్యాంక్ బండ్ తో పాటు పీవీమార్గ్, నక్లెస్ రోడ్డు వై పుకూడా వేలాది మంది సందర్శ కులు గుంపులుగా ఉండటం ట్యాం క్ బండ్ ప్రధాన వేదికపై జరుగు తున్న కళారూపాల ప్రదర్శన, కళాకారుల పరేడ్ ను తిలకిం చేందుకు 20 భారీ ఎస్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.

ఆకట్టుకున్న హస్తకళల ప్రద ర్శన.. ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదేండ్ల పండుగ సందర్భంగా రెండు కిలో మీటర్ల పరిధిలో 82 స్టాల్స్ ఏర్పా టు చేసింది. తెలంగాణ రుచులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ స్టాళ్ల లో వంటలు వడ్డించారు. ఇందులో ప్రధానంగా శాఖాహారానికి అత్యంత ఆదరణ లభించింది. అలాగే రాష్ట్రంలోని పలుప్రాంతాల నుంచి ప్రముఖ సంస్థలు తమ ఉత్ప త్తుల ను స్టాళ్లలో విక్రయించాయి. వీటితో పాటుగా హస్తకళల ప్రదర్శన స్టాల్స్(Handicraft exhibition stalls)ఏర్పాటు చేశారు. తెలంగాణ చేనె త వస్త్రాల స్ట్రాల్ పలువురిని అమితంగా ఆకట్టుకుంది. అలాగే తెలంగాణ పిండి వంటలకు ఆదర ణ లభించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్టాల్ దగ్గర జొన్న రొట్టె రుచి చూసి ఆస్వాదించారు.

అలరించిన రాష్ట్ర గీతం ప్రదర్శన.. అందెశ్రీ రాసిన “జయహో తెలంగాణ రాష్ట్ర గీతం పూర్తి నిడివిపై కళాకారులు చేసిన నృత్య ప్రదర్శన దశాబ్ది ఉత్సావాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం వేదికకు ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై సుమారు 2వేల మంది కళాకారులు ఈ గీతంపై నృత్య ప్రదర్శన చేశారు. తెలంగాణ సంగీ త, నాటక అకాడమీ చైర్మన్ అలే ఖ్య పుంజల(Alekhya Punjala) నేతృత్వం లో సంగీత రూపకం రూపొందించారు. 13 నిమిషాల పాటు ప్రదర్శించిన ఈ రూపకం అద్యంతం అమోఘంగా నిలి చింది. అందెశ్రీ రాసిన ఈ రాష్ట్ర గీతంలో శాతవాహనుల నుంచి రాచకొండ వీరులు, సర్వా యి పాపన్న వీరగాధ, కొ మురం భీం పోరాటం, సాహితీవేత్తల రచనలు, కాకతీ యుల కళావైభ వంతో పాటుగా గోల్కొండ నవాబు లను గుర్తు చేస్తూ సాగిన ఈ గీతా నికి అనుగుణంగా పేరిణీ, కూచి పూడి, భరత నాట్యంతో పాటు 17 కళారీతులను ఒకవైపు ప్రదర్శి స్తుంటే మరోవైపు 5వేల మంది పోలీసులు తీసిన ఫ్లాగ్ ర్యాలీ ఆకట్టు కుంది. రాష్ట్ర గీతం రాసిన అందెశ్రీ, సంగీత బాణీ సమ కూర్చి న కీరవాణిని రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, సీఎం రేవం త్రెడ్డి ఈ ఉత్సవాల్లో ఘనంగా సన్మానించా రు.

విశేషంగా ఆకట్టుకున్న లేజర్ షో… హుస్సేన్ సాగర్పై ఏర్పాటు చేసిన లేజర్ షో(Laser show)ఎంతో ఆక ర్షనీయంగా సాగింది. మిరిమిట్లు గొలిపే లేజర్ కాంతులతో వినీలా కాశంలో తెలంగాణ పేరును ముద్రిం చడం ఈ లేజర్ షోలో ప్రత్యేకత, సుమారు పది నిమి షాలు నిర్వ హిం చిన లేజర్ షో సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. బాణా సంచా మెరుపులు లేజర్ షోకు మిరిమిట్లు కొలిపింది. అయితే బాణాసంచా ముగియగానే వర్షం కురవడంతో కార్య క్రమానికి కొంత అంతరాయం కలిగింది. అయితే ప్రేక్షకులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే ఏర్పాట్లు చేసిన ప్పటికీ వర్షం నుంచి తప్పించుకోలే కపోయారు. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు గొడుగులతో కొద్ది సేపు గడిపారు. అయితే కార్యక్ర మం ముగింపులో వర్షం రావడంతో పదేండ్ల పండుగ ఉత్సవాలకు అంతరాయం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Telangana formation day celebrations