Telangana logo innovation :రాజముద్రకు ఆమోదముద్ర మరికొంత ఆలస్యం
తెలం గాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. ప్రజలు, ప్రతిప క్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనబడు తోంది.
వాయిదా పడిన తెలంగాణ లోగో
ఆవిష్కరణ
జూన్ 2న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయo
తెలంగాణ గీతం మాత్రo జూన్ 2నే విడుదలకు అంగీకారం
–ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల వ్యతి రేకతతో వెనక్కి తగ్గిన రేవంత్ ప్రభుత్వం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ కొత్త రాజముద్ర ఆవిష్కరణ వాయిదా పడింది. ప్రజలు, ప్రతిప క్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనబడు తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఖరారయ్యిందని గడిచిన 24 గంటలుగా హడావుడి జరిగిన సంగతి తెలిసిందే. అదిగో ఇదిగో ఆవిష్కరణ అంటూ కాంగ్రెస్(Congress) నేతల వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరిగింది. ఈ క్రమంలో అదిగో, ఇదిగో ఇదే ఫైనల్ అని రాజముద్ర(Royal seal)ఫొటోలు తారాస్థా యిలో వైరల్ అయ్యాయి. కాగా తెలంగాణ కొత్త రాజముద్ర ఆవిష్క రణ వాయిదా పడింది.
తొలుత జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా రిలీజ్ చేయాలని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్02న కాకుండా మరో రోజున ఆవిష్కరిం చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణ యించింది. దీనిపై ఉన్నతాధి కారు లు సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదిం పులు జరుపుతున్నారు. అయితే తెలంగాణ(Telangana) గీతం మాత్రమే జూన్ 02నే విడుదల చేస్తారని తెలు స్తోంది. అయితే ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, తెలంగాణ ప్రజల్లో ఓ వర్గం నుంచి వస్తున్న వ్యతిరేకత తో ప్రభుత్వం పునరాలోచనలో పడింద నే వార్తలు వినవస్తున్నాయి.
ఇదిలా ఉండగా కొత్త లోగోలో(Logo) కాకతీయ తోరణం, చార్మి నార్ స్థానంలో అమ రవీరుల స్థూపానికి రేవంత్ రెడ్డి సర్కార్ అవకాశం కల్పించినట్లు తెలుస్తోంది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహా ల లోగోను పైభాగంలో పొందుపరి చినట్లు, కొన్ని చిత్రాలు నెట్టింట్లో వైర ల్ అవుతున్నాయి. ఈ లోగోనే రేవంత్ ప్రభుత్వం దాదాపు ఖరారు చేసిందని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం 40కిపైగా డిజైన్లను కాంగ్రెస్ సర్కార్ పరిశీలించగా ఒక్కటి మాత్రం ఫైనల్ చేసిందని అంటున్నా రు. మరో రెండు రోజుల్లో అవతరణ ఉత్సవాల నేపథ్యంలో కొత్త లోగో ను ఆవిష్కరించాలని నిర్ణయించి నప్పటికీ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.
Telangana logo innovation delay