–రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై కితాబు
–క్షేత్ర స్థాయి అధికారులతో టీజీ ఎస్ఆర్టీసీ యాజమాన్యం సమా వేశం
TGSRTC:ప్రజా దీవెన, హైదరాబాద్: రాఖీ ఆపరేషన్స్, మెరుగైన పనితీరుపై తమ క్షేత్రస్థాయి అధికారులతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) (TGSRTC)యాజమాన్యం ప్రత్యేకంగా సమావే శమైంది. హైదరాబాద్ బస్ భవన్ నుంచి వర్చ్‌వల్‌గా బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఉన్నతా ధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ పాల్గొన్నారు. రాఖీ పండుగ ఆపరేషన్స్‌లో (In Rakhi festival operations) సిబ్బంది పనితీరు, అనుభవాలతో పాటు భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిం చారు. క్షేత్రస్థాయి అధికారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మాట్లాడుతూ రాఖీ పండుగ సంద ర్భంగా సంస్థలోని ప్రతి ఒక్కరూ అద్బుతంగా పనిచేశారని కొని యాడారు.
భారీ వర్షాల్లోనూ నిబద్ద త, అంకితభావం, క్రమశిక్షణతో (With commitment, dedication and discipline) పనిచేశారని ప్రశంసించారు. ఈ నెల 18, 19, 20 తేదిల్లో రికార్డుస్థాయి లో 1.74 కోట్ల మందిని క్షేమంగా గమ్యస్థానాలకు సంస్థ చేరవేసిందని తెలిపారు. వరుసగా మూడు రోజు లు సంస్థలో 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమో దైందని వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాఖీ ఒక్క రోజే 63 లక్షల మంది తమ బస్సు ల్లో రాకపోకలు సాగించారని గుర్తు చేశారు. మూడు రోజుల్లో 1.07 కోట్ల కిలోమీటర్ల మేర ఆర్టీసీ బస్సు లు తిరిగాయని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీ పౌర్ణమి (In Rakhi festival operations) నాడు 21 డిపో లు 100 శాతానికి పైగా ఆక్యూ పెన్సీ రేషియో(ఓఆర్) నమో దు చేయగా ఈ సారి 97 డిపోలు ఆ మైలురాయిని దాటాయని తెలి పారు. ఈ రాఖీ పండుగ (In Rakhi festival operations) టీజీఎస్ఆ ర్టీసీ రికార్డులన్నింటినీ తిరగరాసింద ని తెలిపారు. అత్యధిక ఆక్యూపెన్సీ రేషియో(ఓఆర్) నమోదు చేసిన మహబుబ్‌నగర్, నల్లగొండ, మెదక్, వరంగల్, కరీంనగర్ రీజియన్ల ఆర్ ఎంలను ప్రత్యేకంగా అభినందిం చారు. అలాగే, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, హుజురాబాద్, దుబ్బాక, కల్వకుర్తి, ముషీరాబాద్, దేవరకొండ, తొర్రూర్, నార్కెట్‌పల్లి, షాద్‌నగర్ డిపోలు అత్యధిక ఓఆర్‌ను నమోదు చేశా యని, ఆయా డీఎంలకు, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.
రాఖీ పౌర్ణమి నాడు(In Rakhi festival operations) విధుల్లో నిర్వ ర్తిస్తున్న సిబ్బందికి మధ్యాహ్న భోజ నం అందించాలని నిర్ణయం తీసుకు న్న సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ను ఈ సందర్భంగా అధికారులు అభినం దించారు. భోజనం అందించడం వల్ల ఎలాంటి ఆలస్యం లేకుండా ఆపరేషన్స్ సజావుగా జరిగాయని, కొందరు డ్రైవర్లు బస్సు స్టీరింగ్ (Drivers are steering the bus)పై కూర్చుని భోజనం చేసి వృత్తి పట్ల తమ నిబద్దతను చాటుకున్నారని యాజమాన్యం దృష్టికి తీసుకువ చ్చారు.అధికారులు, సిబ్బంది పని తనాన్ని యాజమాన్యం గుర్తిస్తుం దని, రాఖీ పౌర్ణమి ఆపరేషన్స్‌లో మెరుగైన పనితీరును కనబరిచిన వారికి త్వరలోనే రివార్డులను అంద జేస్తుందని తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీని ఆదరిస్తూ వెన్నుదన్నుగా నిలుస్తోన్న ప్రయాణికులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ సమావేశంలో సీవోవో డాక్టర్ రవిందర్, జేడీ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముని శేఖర్, ఫైనాన్స్ అడ్వైజర్ విజయ పుష్ఫ, వివిధ విభాగాల హెచ్‌వోడీ లు శ్రీదేవి, శ్రీధర్, వెంకన్న, సుధాప రిమళ, విజయభాస్కర్, డిప్యూటీ సీటీఎం జ్యోతి, తదితరులు పాల్గొ న్నారు. వర్చ్‌వల్‌గా హైదరాబాద్ అండ్ కరీంనగర్ జోన్ ఈడీ వినోద్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ వెంకటేశ్వర్లుతో పాటు ఆర్ఎం లు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు హాజరయ్యారు.