Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Theif Arrested: వ్యసనాలకు బానిసలై జల్సాలు

–చోరీలకు అలవాటుపడి సెల్ ఫోన్ లు తస్కరిస్తున్న దొంగ అరెస్ట్

Theif Arrested: ప్రజాదీవెన, హైదరాబాద్: జల్సాలకు అలవాటయ్యారు. దానికి తోడు వ్యసనాలు.. దీంతో చోరీల బాట పడుతున్నారు కొందరు యువకులు. తల్లిదండ్రులను.. వారి పరువు మర్యాదలను అసలు పట్టించుకోకుండా.. చట్ట వ్యతిరేక పనులకు పూనుకుంటున్నారు. కొడుకు అడిగాడని.. డబ్బు అరువు తెచ్చి మరీ కేటీఎం (ktm bike)బైక్ కొనిచ్చాడు తండ్రి. కానీ ఆ కొడుకు ఆ బైక్‌పై రయ్యిన దూసుకుపోతూ సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడుతున్నాడు. బైక్ నంబర్ చిక్కకుండా బాగానే మ్యానేజ్ చేశాడు. కానీ దానిపై రాసిన ఓ ‘కొటేషన్‌’ తో అడ్డంగా బుక్కయ్యాడు. జూబ్లీహిల్స్‌ పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డునంబర్‌-25కు చెందిన రామకృష్ణ జులై 24న హాస్పిటల్‌కు వెళ్ళిన తన భార్య కోసం… జూబ్లీహిల్స్‌లో (In Jubilee Hills) వెయిట్ చేస్తుండగా.. ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతని చేతిలోని ఫోన్ (phone)లాక్కొని ఎస్కేప్ అయ్యారు.

బాధితుడు కంప్లైంట్ (Compliant) చేయడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు సీసీ కెమెరాలను (CC cameras) పరిశీలించారు. నిందితులు కేటీఎం బైక్‌పై వచ్చినట్లు గుర్తించారు. నంబర్‌ ప్లేట్‌.. కనిపించకుండా మాస్టర్ ప్లాన్ (master plan)వేసినప్పటికీ.. పోలీసులు కేటీఎం షోరూం ద్వారా సిటీలో ఆ వాహనాలు వాడుతున్న వారి వివరాలు సేకరించారు. అనుమానిత వాహనాల లిస్ట్ రెడీ చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. దుండగులు తమ బైక్‌పై రాసుకున్న ‘ రెడీ టు రేస్‌’ (Ready to race)పేరుతో ఉన్న కొటేషన్‌ను పట్టేవారు పోలీసులు. దీంతో తీగ దొరికింది. బేగంపేటలో నివసించే కిరణ్‌ కుమార్‌(19)తోపాటు మరో మైనరు ఉన్నట్లు గుర్తించి వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించగా.. చోరీ చేసింది తామే అని ఒప్పుకున్నారు. కిరణ్‌కుమార్‌ తండ్రి… సైకిల్‌పై టిఫిన్‌ అమ్ముతూ తనయుడు ఆశపడి అడగడంతో… అప్పు చేసి మరీ కేటీఎం బైక్, ఐఫోన్‌ కొనిచ్చాడని పోలీసులు తెలిపారు. కిరణ్‌తోపాటు అతని మిత్రుడు తాగుడుకు, జల్సాలకు అలవాటు పడి చోరీల బాట పట్టినట్లు వెల్లడించారు.