Market Committee: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో మరో 4 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ (Market Committee)లకు నూతన పాల కవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటివరకు నాలుగింటితో కలిపి మొత్తం 48 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao) వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మార్కెట్ కమిటీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీలను నియమిస్తామని తెలుపుతు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనా పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియచేశారు.
బుధవారం 4 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను (chair person), వైస్ చైర్ పర్సన్లను (Deputy chair person), నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 48 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, హన్మకొండ జిల్లాలోని పరకాల, యాదాద్రి జిల్లాలోని ఆలేరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను మరియు వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అల్లూరి అశోక్ రెడ్డి గారు, వైస్ చైర్ పర్సన్ గా సవపూరె విలాస్ గారు, అచ్చంపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అంతటి రజిత గారు, వైస్ చైర్ పర్సన్ గా రసుమొల్ల వెంకటయ్య గారు, పరకాల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా చందుపట్ల రాజిరెడ్డి గారు, వైస్ చైర్ పర్సన్ గా మరపల్లి రవీందర్ గారు, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఇనాల చైతన్య గారు, వైస్ చైర్ పర్సన్ గా పచిమట్ల మదర్ గౌడ్ గారిని నియమించడం జరిగింది