TPCC: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల ( బిసి )కమిషన్ చైర్మన్ గా జీ.నిరంజన్ సభ్యులుగా రాపో లు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,రంగు బాలలక్ష్మి లు పద వి బాధ్యతలు చేపట్టిన సంధ ర్భంగా ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో టిపిసిసి (TPCC) నాయకులు జగన్ యాదవ్ వారిని కలసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సంధర్భంగా జగన్ యాదవ్ (Jagan Yadav)మాట్లాడుతూ సామజిక న్యాయానికి అత్యంత ప్రాధన్యత ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని దానికి అనుగుణంగా బిసిలకు ప్రాధాన్యత ఇస్తుంది ,కుల గణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని బిసి కమిషన్ ద్వార కుల గణన చేపట్టబోతుందనీ తెలిపారు.బిసి లకు ప్రధాన్యత ఇచ్చేందుకు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goudనీ పీసీసీ గా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిందనీ, దేశంలో కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంతో (Central Govt) రాహుల్ గాంధీ పోరడుతున్నారన్నారు.
అదేవిదంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులూ జీ.నిరంజన్, తిరుమలగిరి సురేందర్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణా విద్యార్థి ఉద్యమ నాయకురాలు శ్రీమతి రంగు బాలలక్ష్మిని…మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన రాపోలు జయప్రకాష్ గారు ఎన్ ఎస్ యు ఐ,యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ పార్టీ (Congress party) లో వివిధ హోదాల్లో పార్టీ కోసం అనునిత్యం కష్టపడి పని చేసిన వారిని గుర్తించి బీసీ కమిషన్ సభ్యులుగా నియమించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, మంత్రివర్గానికి మరియు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. కలిసిన వారిలో టిపిసిసి ఓబీసీ ఉపధ్యక్షు డు టి రవీందర్, యూత్ కాంగ్రెస్ నాయకులూ శ్రీకాంత్ గౌడ్, రమేశ్ నాయక్ ,రాము మరియు రఘునందన్ యాదవ్ తదితరులు ఉన్నారు.