–వికారాబాద్‌లో అరెస్టు, 62 గ్రాముల గంజాయి స్వాధీనం
–ఓ ప్రముఖ టీవీ అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ అరెస్ట్
–మరో ఘటనలో 50 కిలోల గం జాయితో ఇరువురి అరెస్టు
Trafficking in marijuana: ప్రజా దీవెన, వికారాబాద్: గంజాయి అక్రమ రవాణా పై పోలీసుల దాడు లు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. గంజాయి పై ఉక్కుపాదం మో పుతూ దాడులు కొనసాగిస్తున్నా రు. ఓ ప్రముఖ టీవీ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరియో గ్రాఫర్‌గా (Assistant Choreographer) పని చేస్తున్న ఓ యువ కుడు గంజాయి కేసులో వికారాబాద్‌లో అరెస్ట్ (arrest) అయ్యాడు. పోలీసులు అతని వద్ద 62 గ్రాముల గంజా యిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు (Excise and Task Force Police) వికారాబాద్‌లోని పలు కూడళ్ల వద్ద మంగళవారం తనిఖీ లు నిర్వహించారు. ఇందులో భా గంగా స్థానిక బీజేఆర్ చౌరస్తా సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ యువకుడిని గమనించి తనిఖీ చేశారు. వినోద్ కుమార్ అలియాస్ అలెక్స్ అనే యువకుడి వద్ద గంజాయి లభ్య మవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు (Excise Police)అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన అలెక్స్ ఓ టీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ కార్యక్రమంలో అసిస్టెంట్ కొరి యోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, అలెక్స్ పలువురు స్నేహితులతో (అమ్మాయిలు కూడా ఉన్నారు) కలిసి హైదరాబాద్ నుంచి వికారా బాద్ వచ్చి సోమవారం నుంచి ఓ లాడ్జిలో బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిలోని మహేశ్వరం గేటు సమీపంలో చేసిన తనిఖీల్లో 50 కిలోల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు (arrest) చేశారు. మహేశ్వరం గేటు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఏపీకి చెందిన అనిల్, వెంకటలక్ష్మిని పోలీసులు సోమవారం తనిఖీ చేశారు. వారి వద్ద సుమారు రూ.13 లక్షల విలువైన 50 కిలోల గంజాయి దొరకడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసిన నిందితులు హైదరాబాద్‌లో (Hyderabad)అమ్మేందుకు వెళుతూ పోలీసులకు చిక్కారు.
గంజాయి కేసులో ఇద్దరికి 20 ఏళ్ల జైలు గంజాయి రవాణా (Transportation of marijuana) చేస్తూ పట్టుబడిన ఇద్దరికి మ హబూబాబాద్ జిల్లా కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష (Imprisonment) విధించింది. మహ బూబా బాద్ జిల్లా మరిపెడ మండలం తం డ ధర్మారానికి చెందిన బానోత్ కిరణ్‌కుమార్ అలి యాస్ దేవా, భద్రాద్రి కొత్త గూడెంకు చెందిన బా దావత్ సూర్య ట్రాక్టర్‌లో గంజా యిని రవాణా చేస్తూ 2021 జూలై 7న డోర్నకల్‌లో పట్టుబడ్డారు. వీరి వద్ద రూ.30 లక్షలు విలువ చేసే మూడు క్వింటాళ్ల గంజాయి దొరి కింది. ఈ కేసులో విచారణ అధి కారి, అప్పటి డోర్నకల్ సీఐ ఇస్లా వత్ శ్రీనివాస్‌నా యక్ సాక్ష్యాన్ని తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్ నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.