Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Transfers of IAS: ఐఏఎస్ ల స్థానచలనం

–ఒకేసారి 44 మంది ఐఏఎస్ ల బదిలీ

Transfers of IAS: ప్రజాదీవెన, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) సోమవారం భారీగా ఐఏఎస్‌ల బదిలీలు (Transfers of IAS)చేపట్టింది. ఒకే రోజు 44 మంది అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్‌గా ఆమ్రపాలి, పశు సంవర్థక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కార్మిక ఉపాధి శిక్షణ శాఖ (Department of Labor Employment Training) ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌ను నియమించారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి.. చేనేత, హస్తకళల ముఖ్య కార్యదర్శితో పాటు హ్యాండ్లూమ్స్, టీజీసీవో హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా (TGCO Handcrafts as MD) శైలజా రామయ్యను నియమించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు. ఆయనకు ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శిగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా సందీప్ కొనసాగనున్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్‌ను నియమించడం సహా టీపీటీఆర్ఐ డీజీగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు.