–రవాణా, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్
–వాణిజ్య పన్నుల కమిషనర్ టీకే శ్రీదేవి ఎస్సీ అభివృద్ధి శాఖకు బదిలీ
Transfers of IAS: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో (Telangana State)మరోమారు ఐఏఎస్ అధికారుల (Transfers )బదిలీ జరిగింది. ఇద్దరు నాన్ ఐఏఎస్‌లు (IAS) సహా ఎనిమిది మంది అధికారు లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రవాణా, గృహ నిర్మాణ, సాధారణ పరిపాలనా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న వికాస్‌రాజ్ పోస్టులో (Vikasraj Post) స్వల్ప మార్పు చేసింది. ఆయన పోస్టును రవాణా, రోడ్లు–భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రీ–డిజిగ్నేట్ చేసింది.
వికాస్‌రాజ్ ఇక నుంచి రవాణా, ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణ, సాధారణ పరిపాలనా శాఖల (Transport, R&B, Housing, General Administration Departments) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల కమిషనర్ టీకే శ్రీదేవిని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీకి వాణిజ్య పన్నుల శాఖ (Commercial Taxes Department to SAM Rizvi) కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిం చారు. రవాణా, రోడ్లు–భవనాల శాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.హ రీశ్ రెవెన్యూ శాఖలోని విపత్తుల విభాగం సంయుక్త కార్యదర్శిగా బదిలీ అయ్యారు. వ్యవసాయ, సహకార శాఖ సంయుక్త కార్యదర్శి పి.ఉదయ్‌కుమార్‌కు మార్కెటింగ్ శాఖ సంచాలకులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సూ ర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంకను పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా బదిలీ చేశారు. సహ కార శాఖ సంయుక్త రిజిస్ట్రార్, నాన్ ఐఏఎస్ కె.చంద్రశేఖర్‌రెడ్డిని బదిలీ చేసి హైదరాబాద్ అగ్రికల్చరల్ కో–ఆపరేటివ్ అసోసియేషన్ (Agricultural Co-operative Association)మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించా రు. వరంగల్ వాణిజ్య పన్నుల సంయుక్త కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డిని మార్క్‌ఫెడ్ ఎండీగా నియమిం చారు.