— ఈ దఫా 16 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు
— వీటితో కలిపి మొత్తం 64 అగ్రిక ల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించాం
–వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన మార్కెట్ కమి టీలకు కూడా కొత్త మార్కెట్ కమిటీ లను నియమించామని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మ ల నాగేశ్వ రరావు (Tummala Nageswara Rao) తెలిపారు. మరోమారు తాజాగా 16 అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్లను, వైస్ చైర్ పర్సన్లను, నూతన పాలకవ ర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వీటితో కలిపి ఇప్పటివ రకు రాష్ట్ర వ్యాప్తంగా 64 అగ్రికల్చ ర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమించడం జరిగిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వీర్నపల్లి, రాచల బొప్పారం, గంభీరావుపేట, పోతుగల్, పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, జూలపల్లి, జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, మేడ్చల్ జిల్లాలోని కూకట్ పల్లి, వనపర్తి జిల్లాలోని పెబ్బేరు, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ, నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, ధరూర్, రంగారెడ్డి జిల్లాలోని గడ్డిఅన్నారం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను మరియు వైస్ చైర్ పర్సన్లతో (Vice Chairpersons) పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మార్కెట్ కమిటీ ల నియామ కం ఇలా… సిరిసిల్ల మార్కెట్ కమిటీ (Sirisilla Market Committee)చైర్ పర్సన్ గా వేముల స్వరూప, వైస్ చైర్ పర్సన్ గా నేరేళ్ళ నర్సయ్య, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా లకావత్ రాములు, వైస్ చైర్ పర్సన్ గా లెంకల లక్ష్మణ్, రాచల బొప్పారం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా షేక్ షబ్బీర్ బేగం, వైస్ చైర్ పర్సన్ గా గుందడి రాంరెడ్డి, గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కొమిరిశెట్టి విజయ , వైస్ చైర్ పర్సన్ గా పత్తూరి అంజిరెడ్డి, పోతుగల్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తలారి రాణి , వైస్ చైర్ పర్సన్ గా వేముల రాంరెడ్డి, పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఈర్ల స్వరూప, వైస్ చైర్ పర్సన్ గా కూర మల్లారెడ్డి, జూలపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గండు సంజీవ్, వైస్ చైర్ పర్సన్ గా కొమ్మ పోచాలు, మల్లా పూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అనతడ్పల పుష్పలత, వైస్ చైర్ పర్సన్ గా ఎట్టేడి నారాయణరెడ్డి, కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కే. పుష్పరెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా జి. ప్రకాశ్ ముదిరాజ్, పెబ్బేరు మార్కెట్ కమిటీ చైర్ పర్స న్ (Pebberu Market Committee Chair Person No)గా ఎ. విజయలక్ష్మీ, వైస్ చైర్ పర్సన్ గా ఎం. ఎల్లస్వామి గౌడ్, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గడ్డమీది పెంటయ్య, వైస్ చైర్ పర్సన్ గా బెగారి రాములు, నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఆర్. శివారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా కొనంగేరి హనుమంతు, కేసముద్రం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గంట సంజీవ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా పెద్దబోయిన అయిలయ్య, ధరూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కే. విజయ భాస్కర్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా లింగంపల్లి అశోక్ , మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఎల్లనొల్ల మహేందర్ రెడ్డి , వైస్ చైర్ పర్సన్ గా జి. మల్లే ష్ యాదవ్, గడ్డిఅన్నారం మార్కె ట్ కమిటీ చైర్ పర్సన్ గా కొత్తపల్లి జయపాల్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా చిలుకుల మధుసుదన్ రెడ్డి లను నియమించడం జరిగిందని మంత్రి వెల్లడించారు.