Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tummala Nageswara Rao: ప్రతిపక్షాల విచిత్ర విన్యాసాలు

— వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుండి రాష్ట్రములో ప్రతిపక్ష నేతలు అనేక విన్యాసాలు చేస్తూ, సోషల్ మీడియా సాక్షిగా, రైతాంగాన్ని తమ అసత్య ప్రచారాలతో ఆందోళన కు గురి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు కట్టుబడి అమలు చేస్తున్న పథకాలతో ప్రజల్లో పార్టీ పట్ల పెరుగుతున్న నమ్మకం చూసి , తమ రాజకీయ మనుగడ కాపాడుకునేo దుకు పడ్తున్న పాట్లు ను చూసి జాలి వేస్తుందని వ్యాఖ్యా నించారు.

ఒకరేమో లక్ష మాఫీ (Lakh waived off)చేయడానికే ఆప సోపాలు పడి, చివరికి సగం మందికి కూడా చెయ్యలేక రైతుల నమ్మకం కోల్పోయిన వారు, ఇంకొ కరు తాము అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రం లోను ఇప్పటిదాకా రుణమాఫీ పధకం ఆలోచనే చెయ్యని వారు వీరిద్దరూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)అధికారం లోకి వచ్చిన మొదటి పంట లోపే 2 లక్షల వరకు రుణ మాఫీ చేసి, ఇంకా ప్రక్రియ కొనసాగుతుండగానే, ఎటూ పాలు పోక కాంగ్రెస్ ప్రభుత్వం పై విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్స్ నుండి అందిన ప్రతి ఖాతాదారునికి వారి అర్హత బట్టి మాఫీ చేసే బాధ్యత మా ప్రభు తానిదన్నారు.ఇప్పటికి కేవలం రెండు లక్షల వరకు కుటుంబ నిర్దారణ జరిగిన ఖాతాదారు లందరికి పధకాన్ని వర్తింప చేసా మని స్పష్టం చేశారు. రూ. 2 లక్షల లోపు మిగిలి ఉన్న ఖాతాలకు కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా చెల్లిస్తామని చెప్పారు. 2 లక్షల పైన ఉన్న ఖాతాలకు , ప్రభు త్వ ఉత్తర్వుల ప్రకారం వారు ముం దు 2 లక్షల కంటే అదనంగా పొంది న రుణాన్ని చెల్లించిన పిదప , అర్హ త బట్టి (Pidapa, as per eligibility) చెల్లిస్తామని పేర్కొన్నారు.

బ్యాంకర్లు నుండి వచ్చిన డేటా తప్పుగా (Data is incorrect) వివరాలు ఉన్న రైతుల వివరాలును కూడా రైతుల వద్ద నుండి సేకరిస్తున్నామని, రుణ మాఫీ పొందిన రైతులకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేయాల్సింది గా బ్యాంకర్స్ ను కోరామన్నారు.అందరికి సమాచారం కోసం గత ప్రభుత్వ నిర్వకాలు ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం గా రుణ మాఫీ వివరాలు మీకు అంది స్తున్నామని తెలిపారు. కనీసం గత ప్రభుత్వ పెద్దలు తాము అధికా రంలో వున్నప్పుడు అరకొరగా అమలు చేసిన రుణమాఫీ తో ప్రయోజనం ఏ మేరకు జరిగిందో ఆత్మ పరిశీలన చేసుకొని, ఇకనైనా హుందాగా ప్రవర్తించి, ప్రజల్లో తమ స్థాయిని కాపాడు కొంటారని ఆశి స్తున్నామన్నారు. ఇచ్చిన మాట కు కట్టుబడి రూ. 31000 కోట్లు నిధులు కేటాయించుకొని, గత ప్రభు త్వ పెద్దల నిర్వాకం తో చిన్నా భిన్నం చేసిన ఆర్థిక పరిస్థితులు (Financial conditions)లోను, ఆగస్ట్ 15 లోపు , 18000 కోట్లతో 2 లక్షల లోపు రుణ మాఫీ చేసిన ప్రభుత్వంతో సవాళ్ళా అని ప్రశ్నించారు.