Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Tummala Nageswara Rao: బిజెపి నాయకుల వ్యాఖ్యలు విడ్డూరం

— రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala Nageswara Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: బిజెపి నాయకులు మాట్లాడుతూ చాలా మంది రైతులకు రుణమాఫీ జరగ లేదఓoటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణ చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వ రరావు (Tummala Nageswara Rao) వ్యాఖ్యానించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న వాగ్ధానాలు ఏమ య్యా యి రైతుల ఆదాయం రెట్టింపు కాదు కదా, కనీసం నికరాదాయం లో, గత పది సంవత్సరాలలో పెరి గిన ఖర్చులతో పోల్చుకుంటే, పెరగ ని వాళ్ళందరినీ బిజెపి టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా అని ప్రశ్నించారు. స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేసి, రైతు లను ఆదుకోమని, రాజధాని వీధు లకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న వారి విజ్ఙప్తులు ఎప్పుడన్న పట్టిం చుకొన్నారా అన్నారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రం లోనైనా రుణమాఫీ చేసి చూపించగ లరా కొన్ని లక్షల కోట్లు ఎగ్గొట్టిన పారిశ్రామిక వేత్తలనుండి నిధులు రికవరీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబ ద్ధత మీకుందా అని ఆ గ్రామం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఎరు వుల మీద రాయితీ ఇస్తుందని అని చెప్పడం తప్ప రైతంగానికి ప్రత్యేకంగా చేసేందేమిటి అన్న దానికి సమాధానం చెప్పగలరా అన్నారు.

పామాయిల్ మీద దిగు మతి పన్ను తొలగించి, పామాయిల్ రైతుల నోట్లో మట్టి కొట్టింది కేంద్రప్ర భుత్వ పెద్దలు కాదా అని ప్రశ్నించా రు. గత పదేళ్లుగా బిజెపి ప్రభుత్వం (BJP Govt) అమలు చేయని వందల హామీలలో ‘భారత రైతులకు కనీసం మద్ధతు ధర విషయం ఇచ్చిన హామీ’ ఈ హామీ అమలు చేయక పోవడం వలన తెలంగాణ రాష్ట్ర రైతులే గత తొమ్మిదేళ్లలో 2 లక్షల కోట్ల రూపా యలు నష్టపోయారని గుర్తు చేశా రు. 2023-24 సంవత్సరానికి సి ఎ సి పి అంచనా వేసిన క్వింటాలు ధా న్యం సమగ్ర ఉత్పత్తి ఖర్చు 1911 రూపాయలు కాగా, స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం క్వింటా లు మద్ధతు ధర 2876 రూపాయ లుగా ప్రకటించాల్సిన కేంద్ర ప్రభు త్వం, గతంలో ఇచ్చిన హామీని ఉల్లం ఘించి తప్పుడు పద్ధతుల్లో లెక్కించి క్వింటాలు ధాన్యానికి ప్రకటించిన ధర కేవలం 2203 రూపాయలు మాత్రమే. ఫలితంగా రాష్ట్ర రైతులు ప్రతి క్వింటాలుకు 664 రూపాయలు నష్టపోయారు. దీనిపై కేంద్ర మంత్రివర్యులు మాట్లా డగలరా అన్నారు. కేంద్రములో రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల గురించి మాట్లాడని వారు, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కూడా, మాటకు కట్టుబడి, ఇచ్చిన హామీలు నెరవే రుస్తుంటే, వారి అక్కసు ఈ విధంగా వ్యక్తం చేస్తూ మాట్లాడటం సరికాద ని యావత్తు తెలంగాణ అభిప్రాయ మని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము పంటలభీమా పథకం లో రైతువాటా కూడా కట్టడానికి సిద్ధపడుతుండగా, దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వము అటువంటి ప్రయత్నం చేయకపో వడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మానిఫెస్టోలో ప్రక టించిన విధంగా కౌలు రైతులకు, రైతు కూలీలకు (For tenant farmers and farm labourers) భరోసా కల్పించే బాధ్యత మాదని, ఇప్పటికే సన్న వడ్లను రూ.500 బోనస్ ప్రకటిం చాం. పంటలకు అన్నిటికీ మద్ధతు ధరతో కొనే విధంగా ఈ ప్రభుత్వ ము కృషి చేస్తున్నదని వివరించారు.

ఆర్థికవనరులు మితంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే రైతుకూలీలకు (For farmers) భరోసా, కౌలు రైతు కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించి, అమలు ప్రయత్నాలు చేసే సందర్భములో కేంద్ర పెద్దలు పెద్దమనస్సులో సహకరించాల్సింది పోయి విమర్శ లు చేయడం సరికాదని వ్యాఖ్యా నించారు. రుణమాఫీ 2024 అమ లుకు మా నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించిన తేదీ నుండి తీసు కొంటే రుణమాఫీ వర్తించే కుటుంబా లు తక్కువగా ఉండటం చేత, 12 డిసెంబర్2018 నుండి తీసుకొని, గత ప్రభుత్వము రుణమాఫీ చేయ ని కుటుంబాలకు కూడా వర్తింపచే యడం కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతు లపై (farmers)గల ప్రేమను అర్ధం చేసుకోవచ్చ ని తెలిపారు. రుణమాఫీ 2024లో అక్కడక్కడా ఏర్పడుతున్న సాంకే తిక సమస్యలను ఒక్కొక్కటి పరిష్క రించుకుంటు అర్హలైన ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వర్తింపచే సే విధంగా చర్యలు తీసుకొంటున్నా మని, దానిమీద ఏమైన సందేహాలు బిజెపి పెద్దలు స్వయంగా వచ్చి నివృత్తి చేసుకోవచ్చని, రైతాంగాన్ని గందరగోళంలో నెట్టొద్దని విజ్ఙప్తి చేశారు. వ్యవసాయంలో కీలకమైన డీజిల్, పెట్రోల్ ధరలకు రైతులకు సబ్సిడీపై అందించాల్సిన విష యమై బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా ననిమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా పిఎంకిసా న్ కింద రైతులకు అందించే సహా యాన్ని పెంచాలని, అదేవిధంగా కట్ ఆఫ్ డేట్ ఫిబ్రవరి 2019 నుండి కొత్త డేటా తీసుకొని మరింతమం దికి అందేవిధంగా చూడాలని కోరా రు.రైతు ఉద్యమం సందర్భం గా అమరులైన 708 మందికి పైగా రైతు కుటుంబాలకు తక్షణ పరిహా రం చెల్లించి, రైతుల డిమాండ్లు పరిష్కరించేవిధంగా ప్రయత్నాలు చేయాల్సిందిగా తెలంగాణ రైతాం గం తరఫున బిజెపి పెద్దలకు మంత్రి వర్యులు విజ్ఞప్తి చేశారు చేసారు.